ETV Bharat / politics

కాంగ్రెస్‌ వచ్చాక అన్ని పనులను క్యాన్సిల్‌ చేస్తోంది - వారికి ఏం చేతకాదు : కేటీఆర్​ - KTR Visit Rajanna Sircilla

BRS Leader KTR Visit Rajanna Sircilla District : కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక అన్ని పనులను క్యాన్సిల్​ చేస్తోందని, వారికి అసలు ఏం చేతకాదని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్​ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

KTR Rajanna Sirisilla tour
KTR Rajanna Sirisilla
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 5, 2024, 2:59 PM IST

Updated : Mar 5, 2024, 4:29 PM IST

BRS Leader KTR Visit Rajanna Sircilla District : బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులను, నేతన్నలను ఆదుకున్నామని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR)​ అన్నారు. బతుకమ్మ చీరల నేసే పనిని చేనేతలకు ఇచ్చి పని కల్పించామన్నారు. తమ ప్రభుత్వంలో మంజూరైన ముస్తాబాద్​ రోడ్డును కాంగ్రెస్​ రద్దు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక నేతన్న(Handloom Worker)లు రోడ్డున పడ్డారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ నేతలకు ఏం చేతకాదని ఎద్దేవా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న కేటీఆర్​, కాంగ్రెస్​ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు.

KTR Siricilla Tour : ఎల్​ఆర్​ఎస్​పై బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేయాలని బీఆర్​ఎస్​ కార్యకర్తలకు కేటీఆర్​ పిలుపునిచ్చారు. అలాగే సిరిసిల్లలో ఎల్​ఆర్​ఎస్​పై నిరసన తెలపాలన్నారు. బీఆర్​ఎస్​ ఇచ్చిన ఉద్యోగాలపై కాంగ్రెస్​ ప్రచారం చేసుకుంటోందని తెలిపారు. డిసెంబరు 9న అన్ని హామీలు నెరవేరుస్తానని సీఎం రేవంత్​ మాట ఇచ్చి తప్పారని ఆరోపించారు. బీఆర్​ఎస్​ కేవలం నాలుగు లక్షల ఓట్ల తేడాతోనే మాత్రమే ఓడిపోయిందని గుర్తు చేశారు. కరీంనగర్​ ఎంపీ నియోజకవర్గం సన్నాహక సమావేశం, ముస్తాబాద్​లో కార్యకర్తలతో కేటీఆర్​ సమావేశమయ్యారు.

కాంగ్రెస్​ ఇచ్చిన హామీలు వంద రోజుల్లో అమలు కాకపోతే ఆ పార్టీని బొందపెడతాం : కేటీఆర్​

"బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటు రైతులను ఆదుకున్నాం. అటు నేతన్నలను ఆదుకున్నాం. బతుకమ్మ చీరల నేసే పనిని సిరిసిల్ల, గర్సకుర్తి చేనేతలకు ఇచ్చి పని కల్పించాం. ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో ఉండే నేతన్నను చూసుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పనులను క్యాన్సిల్​ చేస్తోంది. నేతన్నలు రోడ్డున పడ్డారు. కాంగ్రెస్​ నేతలకు ఏం చేత కాదు. రోడ్లు నాశనం అయ్యాయి." - కేటీఆర్​, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

మతం పేరుతో బండి సంజయ్​ ఓట్లు అడగడం తప్ప ఏం లేదు : కరీంనగర్​కు బండి సంజయ్​ చేసిందేమీ లేదని బీఆర్​ఎస్​ నేత కేటీఆర్​ ధ్వజమెత్తారు. మతం పేరుతో ఓట్లు అడగటం తప్ప సంజయ్​ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. అయోధ్య పేరు మీద ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తోందన్నారు. ఈ నెల 12న కరీంనగర్​లో 'కదన భేరీ' బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే బస్సు యాత్రలు, రోడ్డు షోలు నిర్వహిస్తామన్నారు.

కాంగ్రెస్‌ వచ్చాక అన్ని పనులను క్యాన్సిల్‌ చేస్తోంది - వారికి ఏం చేతకాదు కేటీఆర్​

ఎల్ఆర్ఎస్ రద్దు హామీ ఏమైంది? - ఈనెల 6న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నాలు : కేటీఆర్

'అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్​ ప్రభుత్వంపై వ్యతిరేకత - కరీంనగర్​లో బీఆర్​ఎస్ ​- బీజేపీ మధ్యే పోటీ'

Last Updated : Mar 5, 2024, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.