ETV Bharat / politics

రుణమాఫీపై మాట తప్పినా, మడమ తిప్పినా - లక్షలాది రైతు కుటుంబాల తరఫున ఉద్యమిస్తాం : కేటీఆర్​ - KTR TWEET ON Rs 2 lakhs Loan waiver - KTR TWEET ON RS 2 LAKHS LOAN WAIVER

BRS Leader KTR Fires on CM Revanth : ప్రతి పథకంలో లబ్దిదారుల సంఖ్యకు కోత పెట్టడమే లక్ష్యంగా రేవంత్​ సర్కార్​ ముందుకు వెళ్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత కేటీఆర్​ ఆరోపించారు. నాడు పరుగు పరుగున వెళ్లి రైతులను లోన్ తెచ్చుకోమన్న సీఎం రేవంత్​రెడ్డి, నేడు రూ.2 లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారని ఎక్స్​ వేదికగా ధ్వజమెత్తారు. రుణమాఫీపై మాట తప్పినా, మడమ తిప్పినా లక్షలాది రైతు కుటుంబాల తరఫున ప్రశ్నిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు.

KTR tweet on loan waiver
BRS Leader KTR Fires on CM Revanth (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 23, 2024, 7:15 PM IST

KTR Tweet Fire on CM Revanth : ఎలక్షన్లకు ముందు పరుపరుగున వెళ్లి రైతులను లోన్ తెచ్చుకోమన్న సీఎం రేవంత్ రెడ్డి, నేడు రెండు లక్షల రుణమాఫీ చేయటానికి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పాసుబుక్కులు లేవనే నెపంతో, లక్షల మందికి శఠగోపం పెట్టే కుటిల ప్రయత్నం చేస్తే సహించబోమని హెచ్చరించారు.

ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని కొంతమందికి, చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇంకొంతమందికి, శూన్యహస్తం చూపే చీకటి పన్నాగాన్ని చూస్తూ ఊరుకోమని తెలిపారు. లక్షలాది మందిని రూ.500 సిలిండర్ పథకానికి దూరం చేశారని, 200 యూనిట్ల పథకానికి ఆంక్షలు పెట్టి ఆగమాగం చేశారని తెలిపారు. నేడు రూ.2 లక్షల రుణమాఫీని కూడా ఎగ్గొట్టి, లక్షలాది మంది రైతులకు ఎగనామం పెడతామంటే కుదరదని హెచ్చరించారు.

రుణమాఫీపై మాట తప్పితే - ఉద్యమిస్తాం : నాట్ల నాడు ఇవ్వాల్సిన రైతుబంధుకు ఇప్పటికీ దిక్కులేదన్నారు. ఓట్ల పండగ ముగిసినా, ఎకరానికి రూ.7500 రైతుభరోసాకు అడ్రస్సే లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రచారంలో అందరికీ అన్నీ అన్నారు. అధికారంలోకి రాగానే కొందరికే కొన్ని అని కోతపెడుతున్నారని విమర్శించారు. రుణమాఫీపై మాట తప్పితే, లక్షలాది రైతు కుటుంబాల తరఫున ప్రశ్నిస్తాం, పోరాడుతామని ఎక్స్​ వేదికగా చెప్పుకొచ్చారు.

"సీఎం అంటే కటింగ్ మాస్టరా? ప్రతి పథకంలో లబ్దిదారుల సంఖ్యకు కోత పెట్టడమే లక్ష్యమా? సీఎం అనే పదానికి ఇదే సరికొత్త నిర్వచనమా? నాడు పరుగు పరుగున వెళ్లి రైతులను లోన్ తెచ్చుకోమన్నారు. నేడు రూ. 2 లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. మొదలు రూ.39 వేల కోట్లు అని ఇప్పుడు రూ.31 వేల కోట్లకు కటింగ్ పెట్టి కుదించారు. పాసుబుక్కులు లేవనే నెపంతో, లక్షల మందికి శఠగోపం పెట్టే కుటిల ప్రయత్నం చేస్తే సహించం. రేషన్ కార్డు సాకు చూపి, లక్షల మందికి మొండి చెయ్యిచ్చే కుతంత్రం చేస్తే భరించం. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని కొంతమందికి, చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇంకొంతమందికి, శూన్యహస్తం చూపే చీకటి పన్నాగాన్ని చూస్తూ ఊరుకోం. మొన్న, లక్షలాది మందిని రూ.500 సిలిండర్ పథకానికి దూరం చేశారు. నిన్న, 200 యూనిట్ల పథకానికి ఆంక్షలు పెట్టి ఆగమాగం చేశారు. నేడు, రూ.2 లక్షల రుణమాఫీని కూడా ఎగ్గొట్టి, లక్షలాది మంది రైతులకు ఎగనామం పెడతామంటే కుదరదు. నాట్ల నాడు ఇవ్వాల్సిన రైతుబంధుకు ఇప్పటికీ దిక్కులేదు. ఓట్ల పండగ ముగిసినా, ఎకరానికి రూ.7500 రైతుభరోసాకు అడ్రస్సే లేదు. కాంగ్రెస్ ప్రచారంలో “అందరికీ అన్నీ” అన్నారు. అధికారంలోకి రాగానే “కొందరికే కొన్ని” అని కోతపెడుతున్నారు. రుణమాఫీపై మాట తప్పినా, మడమ తిప్పినా, లక్షలాది రైతు కుటుంబాల తరఫున ప్రశ్నిస్తాం, పోరాడుతాం." -కేటీఆర్​ ఎక్స్​ పోస్ట్​

ఏపీ ముఖ్యమంత్రి​తో సమానంగా పని చేస్తామన్న రేవంత్​ రెడ్డి వాదన సరికాదు : దాసోజు శ్రవణ్​ - Dasoju Sravan Fires on CM Revanth

ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వాయిదాల మీద వాయిదాలు : జగదీశ్​ రెడ్డి - BRS Leader Jagadish Reddy

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.