ETV Bharat / politics

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు - నూరు అబద్ధాలతో సమానమని నిరూపితమైంది : హరీశ్ రావు - Harish Rao Tweets On Congress - HARISH RAO TWEETS ON CONGRESS

Harish Rao Tweets On Congress : కాంగ్రెస్‌ పార్టీపై మరోసారి బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు నూరు అబద్ధాలతో సమానమని మరోసారి నిరూపితమైందని మండిపడ్డారు. అబద్ధాల్లో సీఎం రేవంత్‌తో, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పోటీ పడుతున్నారని ఆక్షేపించారు. ఎన్నికల ముందు హామీల వర్షం గుప్పిస్తున్న ప్రభుత్వం ఆ తర్వాత మొండిచేయి చూపిస్తోందని మండిపడ్డారు.

Harish Rao Tweets On Congress
Harish Rao Tweets On Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 19, 2024, 9:18 PM IST

Harish Rao Tweets On Congress : కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు. కాంగ్రెస్‌లో అబద్ధాల పోటీ జరుగుతోందని ఆ పార్టీ నేతలు పోటీపడి మరీ అసత్యాలు చెబుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా కాంగ్రెస్ నేతల వైఖరిని ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు నూరు అబద్ధాలతో సమానమని మరోసారి నిరూపితమైందని మండిపడ్డారు.

అబద్ధాల్లో సీఎం రేవంత్ రెడ్డితో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పోటీ పడుతున్నారని హరీశ్‌రావు ఆక్షేపించారు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీ ఇవ్వలేదని నిండు అసెంబ్లీలో ప్రకటించి అభాసుపాలైన భట్టి తాజాగా రుణమాఫీపై కూడా నాలుక మడత పెట్టారని హరీశ్ రావు మండిపడ్డారు. వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వలేదని భట్టి చెప్పడం 70 లక్షల మంది రైతులను ఘోరంగా వంచించడమేనని అన్నారు.

తెలియనట్టు నటించడం హాస్యాస్పదంగా ఉంది : డిసెంబర్ తొమ్మిదో తేదీనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో చెప్పడమే గాక, ముఖ్యమంత్రిగా మొదటి సంతకం రుణమాఫీపైనే అని చెప్పిన విషయం భట్టికి తెలియనట్టు నటించడం హాస్యాస్పదమని హరీశ్ రావు పేర్కొన్నారు. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లు ఉంది కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఉందని తప్పుపట్టారు.

నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదని అప్పుడే మాట మార్చారు : హరీశ్‌రావు - Harish Rao Fires on Congress Party

ఎన్నికల ముందు హామీల వర్షం గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ అయిపోయాక మొండి చేయి చూపిస్తున్నదని ఆరోపించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తప్పక బుద్ధి చెబుతారని మాజీ మంత్రి తెలిపారు. నిన్న నిరుద్యోగ భృతి పై ఎగవేత - నేడు రైతు రుణ మాఫీ పై దాట వేత ధోరణి అన్న హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడిన వీడియోలను జతచేసి కాంగ్రెస్ నేతల మోసాలకు ఇవే సాక్ష్యాలని పేర్కొన్నారు. గతంలో కూడా హరీశ్‌ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హస్తం పార్టీకి రాజకీయాలే తప్ప రైతుల సమస్యలు పట్టవని ఆయన గతంలో ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారు.

కాంగ్రెస్​కు రాజకీయాలే తప్ప రైతుల సమస్యలు పట్టవు : హరీశ్​ రావు

Harish Rao Counter to Congress Guarantees : 'కాంగ్రెస్‌ హామీలు గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.