Bethi Subhas Reddy To Join BJP : అధికారాన్ని కోల్పోయి నాలుగు నెలలు కూడా గడవకముందే బీఆర్ఎస్ నాయకులంతా ఇతర పార్టీల్లోకి వరుస కడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ముంగిట పార్టీలో వలసలు, బీఆర్ఎస్కు తలనొప్పిగా మారాయి. సిట్టింగ్ ఎంపీలు మొదలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మాజీలు ఇలా వివిధ స్థాయిలోని వారు కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు.
తాజాగా బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పారు. బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్ధతు ఇస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇవాళ కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పూరి సమక్షంలో బీజేపీలోకి చేరారు.
బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే బీజేపీలోకి చేరిన వారిలో జహీరాాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీపాటిల్, నాగర్‌కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు భరత్, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ (వరంగల్ స్థానం), హుజుర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి(నల్గొండ స్థానం) తదితరులు పార్లమెంట్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు.
మోదీ గ్యారంటీలే అస్త్రం - లోక్‌సభ పోరులో జోరుగా బీజేపీ ప్రచారం - LOK SABHA ELECTION 2024