BRS Harish Rao Fires on Congress : బీజేపీని ఎదుర్కొనే పార్టీ కేవలం బీఆర్ఎస్ మాత్రమే అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. వరంగల్‌లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ఆయన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాజాగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరడంపై ఫైర్ అయ్యారు. కడియం బీఆర్ఎస్ నుంచి వెళ్లాక పార్టీలో జోష్ కనిపించిందన్నారు. టికెట్ ఇచ్చినా పార్టీకి ద్రోహం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ (Congress Joinings) నిజ స్వరూపం ప్రజలకు అర్థమైందని, రూ.2 లక్షల రుణమాఫీని సీఎం అటకెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు.
"రేవంత్ రెడ్డిపై కడియం శ్రీహరి ఎన్నో విమర్శలు చేశారు. ఇప్పుడు రేవంత్‌తోనే కడియం శ్రీహరి కండువా కప్పించుకున్నారు. ఇంతగా దిగజారడం అవసరమా అని కడియం ఆలోచించాలి. కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. కాకతీయ తోరణాన్ని తీసేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. కాకతీయ తోరణాన్ని ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండమవుతుంది." - హరీశ్ రావు, మాజీ మంత్రి
Harish Rao on Kadiyam Srihari : కాంగ్రెస్‌వి ఉద్దర మాటలే తప్ప, ఉద్ధరించేది ఏమీ లేదని హరీశ్‌రావు విమర్శించారు. 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామన్నారు, ఏం చేశారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర ప్రజలు కోపంగా ఉన్నారని తెలిపారు. కడియం శ్రీహరి రేవంత్‌పై (Kadiyam Srihari Joins in Congress) ఎన్నో విమర్శలు చేసి, ఆయనతోనే పార్టీ కండువా కప్పించుకున్నారని మండిపడ్డారు. కడియం శ్రీహరికి నిజాయతీ ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పర్యటనకు అద్భుతమైన స్పందన వచ్చిందని చెప్పారు.
కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ - రైతులపై ఎందుకు లేదు? : హరీశ్‌రావు - BRS Party Meeting at Kamareddy