BRS Contest in Parliament Elections 2024 : అసెంబ్లీ ఎన్నికల ఓటమి ప్రభావం బీఆర్ఎస్పై(BRS) కొనసాగుతూనే ఉంది. ప్రతికూల పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతున్న తరుణంలో ఒకరి తర్వాత ఒకరు నేతలు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పి ఇతర పార్టీల్లోకి వలసలు పోతున్నారు. సిట్టింగ్ ఎంపీలతోపాటు మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు కాంగ్రెస్, బీజేపీ గూటికి చేరుతున్నారు. ఆయా పార్టీల నుంచి వారికి లోక్‌సభ అభ్యర్థిత్వాలు ఖరారవుతున్నాయి.
బీఆర్ఎస్లో ఓవైపు వలసలు కొనసాగుతుంటే, మరికొందరు నేతలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి వెనకంజ వేస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించినప్పుడు పోటీకి సుముఖత వ్యక్తం చేసిన నేతలు, ఆ తర్వాత బరిలో నుంచి తప్పుకుంటున్నారు. ఈ విముఖత చేవెళ్ల(Chevella) ఎంపీ రంజిత్‌రెడ్డితో ప్రారంభమైంది. సన్నాహక సమావేశం సందర్భంగా రంజిత్‌రెడ్డిని మళ్లీ గెలిపించుకుంటామని నియోజకవర్గపరిధిలోని నేతలంతా తీర్మానం చేశారు.
Lok Sabha Elections 2024 : ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో ఆయన పోటీకి వెనకంజ వేశారు. మాజీమంత్రి మహేందర్‌రెడ్డి సతీమణితోపాటు, పలువురు నేతలు బీఆర్ఎస్ను వీడి హస్తం పార్టీలో చేరారు. ఇతర పరిణామాలతో పోటీ చేసేందుకు రంజిత్‌రెడ్డి విముఖత చూపారు. ఈ మేరకు అధిష్ఠానానికి తన అభిప్రాయం తెలిపారు. పార్టీ ముఖ్యనేతలు బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ అదే పరిస్థితి నెలకొంది. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి తొలుత ఆసక్తి చూపారు.
కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి - పార్టీ మారడం లేదని క్లారిటీ
నల్గొండ లేదా భువనగిరి నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఐతే జిల్లాలో పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు అమిత్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం సాగింది. మారిన పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని అధిష్ఠానానికి గుత్తా అమిత్‌రెడ్డి సమాచారమిచ్చినట్లు తెలిసింది. సీనియర్ నేతలు ఇంకా అమిత్‌తో మాట్లాడుతున్నట్లు చెపుతున్నారు.
Reluctance of BRS candidates 2024 : మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో అదే పునరావృతమైంది. మాజీమంత్రి మల్లారెడ్డి(Mallareddy) కుమారుడు భద్రారెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయాలని తొలుత భావించారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం సహా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, నేతలను కలిసి వారితో చర్చించి అధిష్ఠానం వద్ద సుముఖత తెలిపారు. తన కుమారుడికి అవకాశమిస్తే పోటీచేసి గెలుస్తామని పలుసార్లు మల్లారెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఐతే కేటీఆర్‌ను కలిసిన మల్లారెడ్డి, భద్రారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయబోమని తెలిపారు. ముందు సిద్ధమై ఆ తర్వాత నేతలు పోటీకి వెనకంజ వేయడంతో తదుపరి కార్యాచరణపై బీఆర్ఎస్ అధిష్ఠానం దృష్టి సారించింది. నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూనే ప్రత్యామ్నాయ అభ్యర్థుల కోసం ప్రయత్నిస్తోంది.
రాష్ట్రంలో కాలం తెచ్చిన కరవు లేదు - కాంగ్రెస్ తెచ్చిన కరవే ఉంది : కేటీఆర్
'గోల్మాల్ గుజరాత్ మోడల్‌కు, గోల్డెన్ తెలంగాణతో పోలికా?' - రేవంత్‌పై బీఆర్ఎస్ విమర్శలు