ETV Bharat / politics

సీఏఏను మతంతో ముడిపెట్టి కాంగ్రెస్​ ఆరోపణలు చేస్తోంది : ఎంపీ లక్ష్మణ్ - LAXMAN MEET WITH MEDIA - LAXMAN MEET WITH MEDIA

BJP MP Laxman Meet with Media : అయోధ్య నిర్మాణాన్ని కాంగ్రెస్​ అడుగడుగునా అడ్డుకుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్​ ధ్వజమెత్తారు. శ్రీరాముడిని అవమానించి హిందువుల మనోభావాలు దెబ్బ తీశారని ఆరోపించారు. సీఏఏను మతంతో ముడిపెట్టి కాంగ్రెస్​ పార్టీ ఆరోపణలు చేస్తోందని అన్నారు. హైదరాబాద్​లోని హోటల్​ గ్రీన్​ పార్కులో జరిగిన ఇంటరాక్టివ్​ మీట్​ విత్​ మీడియా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

BJP MP Laxman Fires on Congress
BJP MP Laxman About CAA
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 27, 2024, 2:13 PM IST

Updated : Apr 27, 2024, 2:39 PM IST

BJP MP Laxman Fires on Congress : సీఏఏను మతంతో ముడిపెట్టి కాంగ్రెస్​ పార్టీ ఆరోపణలు చేస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్​ ధ్వజమెత్తారు. అంబేడ్కర్​ ఆశయాలను బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తోందని లక్ష్మణ్​ అన్నారు. నవంబరు 26న రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. రూ.350 కోట్లతో స్ఫూర్తి, దీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్​లోని హోటల్​ గ్రీన్​ పార్కులో జరిగిన ఇంటరాక్టివ్​ మీట్​ విత్​ మీడియా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

అంబేడ్కర్​ చిత్రపటం పార్లమెంటులో పెట్టి భారతరత్నతో గౌరవించామని ఎంపీ లక్ష్మణ్​ అన్నారు. అంబేడ్కర్​ సేవలు, త్యాగాలు భావితరాలకు అందించేందుకు యత్నిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్​ వైఫల్యం వల్లే పాక్​ అధీనంలోకి పీవోకే వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయోధ్య నిర్మాణాన్ని కాంగ్రెస్​ అడుగడుగునా అడ్డుకుందని ధ్వజమెత్తారు. శ్రీరాముడిని అవమానించి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు. అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేళ రాహుల్​గాంధీ హాజరు కాలేదని విమర్శించారు.

శరణార్థులు భారత్​ వస్తామంటున్నారు : సోమనాథ్​ ఆలయ పునరుద్ధరణకు ఆనాడు కాంగ్రెస్​ వ్యతిరేకించిందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్​ గుర్తు చేశారు. కొత్తగా సీఏఏపై కాంగ్రెస్​ తీవ్ర ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఇస్లాం దేశాల్లో మైనార్టీలు తీవ్ర వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులు, జైనులు, క్రైస్తవులు మత హింసకు గురవుతున్నారని దుయ్యబట్టారు. శరణార్థులుగా భారత్​కు వస్తామని వేడుకుంటున్నారని తెలిపారు. శరణార్థులకు పౌరసత్వం ఇస్తామంటే కాంగ్రెస్​ వ్యతిరేకిస్తోందని విమర్శలు గుప్పించారు. సీఏఏను మతంతో ముడిపెట్టి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని కాంగ్రెస్​ పార్టీ ఆరోపిస్తున్నారని తెలిపారు.

"కొత్తగా సీఏఏపై కాంగ్రెస్​ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇస్లాం దేశాల్లో మైనార్టీలు తీవ్ర వివక్షకు గురవుతున్నారు. హిందువులు, జైనులు, క్రైస్తవులు మత హింసకు గురవుతున్నారు. శరణార్థులుగా భారత్​కు వస్తామని వేడుకుంటున్నారు. శరణార్థులకు పౌరసత్వం ఇస్తామంటే కాంగ్రెస్​ వ్యతిరేకిస్తోంది. సీఏఏను మతంతో ముడిపెట్టి ఆరోపణలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆరోపిస్తున్నారు. అంబేడ్కర్​ ఆశయాలను కాంగ్రెస్​ పార్టీ హరించింది. కానీ బీజేపీ ఆయన ఆశయాలను నెరవేరుస్తోంది. అంబేడ్కర్​కు భారతరత్న ఇచ్చిందే బీజేపీ." - లక్ష్మణ్, ఎంపీ

సీఏఏను మతంతో ముడిపెట్టి కాంగ్రెస్​ ఆరోపణలు చేస్తోంది : ఎంపీ లక్ష్మణ్

హామీలు అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా - కాంగ్రెస్​కు బండి సంజయ్​ సవాల్

పట్టభద్రుల ఉప ఎన్నికలో సత్తా చాటేందుకు సిద్ధమైన బీజేపీ - ఆ ముగ్గురిలో ఛాన్స్ కొట్టేసేది ఎవరో?

Last Updated : Apr 27, 2024, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.