BJP MP Laxman on Reservation in Telangana : కులాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని, పేదరికం ఆధారంగా ఇవ్వాలని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చెప్పిన మాటలను బీజేపీ ఎంపీ లక్ష్మణ్ గుర్తు చేశారు. మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలను అవమానపరిచేలా దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1961లో మాట్లాడారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్‌రెడ్డి నడుస్తున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న రిజర్వేషన్లపై మాట్లాడారు.
MP Laxman Reacts To CM Revanth Comments : పది సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని, గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఎంపీ లక్ష్మణ్ ఖండించారు. కాంగ్రెస్ పార్టీకు ఎన్నికల ప్రక్రియలో పాము గుడ్డు గుర్తుగా ఇచ్చి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారానికి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మెదక్ సభలో రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు అయినందున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వేడుకలు జరుపుతామని స్పష్టంగా చెప్పారని బదులిచ్చారు. ఇప్పటికైనా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలని సూచించారు.
సీఏఏను మతంతో ముడిపెట్టి కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది : ఎంపీ లక్ష్మణ్ - LAXMAN MEET WITH MEDIA
"ఎస్సీ, ఎస్టీలను అవమానపరిచేలా నెహ్రూ 1961లో మాట్లాడారు. ఆనాడు ముఖ్యమంత్రులకు ప్రధాని హోదాలో నెహ్రూ లేఖలు రాశారు. కులాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వవద్దని రాజీవ్‌గాంధీ చెప్పారు. పేదరికం ఆధారంగా ఇవ్వాలని రాజీవ్‌గాంధీ చెప్పారు. హిందువుల మనోభావాలను కాంగ్రెస్ నేతలు గాయపరుస్తున్నారు. కేసీఆర్ బాటలోనే రేవంత్‌రెడ్డి నడుస్తున్నారు. వైఎస్ ఆనాడు బీసీల రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు. మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది." - లక్ష్మణ్, బీజేపీ ఎంపీ
MP Laxman Comments : ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కాంగ్రెస్ పార్టీ వివిధ వర్గాల మధ్య ఘర్షణలు సృష్టించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. రిజర్వేషన్ల విషయంలో ఫేక్ వీడియోలు సృష్టించి ప్రజలను మభ్యపెట్టే పనిలో ఉన్నారని అన్నారు. మండల్ కమిషన్ రిపోర్ట్‌ను వ్యతిరేకించిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని విమర్శించారు. కులరహిత దేశం కావాలని కుల రిజర్వేషన్లు వద్దన్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్త శుద్ది ఉంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిగ్గు తేల్చాలని సూచించారు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కావాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరుకుంటున్నారేమోనని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.