BJP MLC Candidate Election Campaign in Warangal : నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా తనకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గాల ప్రాంతాల అభివృద్ధికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. జయశంకర భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశానికి ఆయనతో పాటు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రేమేందర్ రెడ్డి ఉద్యోగులకు సంబంధించిన 46, 317 జీవోల కారణంగా నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు అత్యధికంగా దేశ ప్రధాని మోదీ పాలన మరోసారి కేంద్రంలో ఉండాలనే ఆకాంక్షతోనే ఓట్లు వేశారని తెలిపారు.
MLA Venkata Ramana Reddy on BRS and Congress : బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నిలకడ లేని పార్టీ అభ్యర్థులని వారిని ప్రజలు నమ్మె ప్రసక్తే లేదని ఎమ్మల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. ప్రేమేందర్ రెడ్డి గతం నుంచి ప్రజల సమస్యలపై పని చేస్తున్నారని తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేస్తున్న బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించారని ఆయన కోరారు.
Etela Rajender Fires on Congress : బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో మాట్లాడిన ఆయన అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందని, అందులో ఉచిత బస్ హామీ తప్ప మిగిలినవి ఏవీ అమలు చేయలేదని మండిపడ్డారు. సంక్షేమం, మౌలిక వసతుల కల్పనలో కాంగ్రెస్ పార్టీ కుంటుపడిందని అన్నారు. బీఆరఎస్ రాష్ట్రంలో మనుగడ లేని పార్టీ అన్నారు. పట్టభద్రులకు డబ్బులు ఆశ చూపి ఓటు వేయించుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుందని ఆరోపించారు. ప్రజల సమస్యల మీదా పోరాటం చేసే పార్టీ బీజేపీ అన్నారు. నిరుద్యోగులు పట్టుభద్రులు ఆలోచించి బీజేపీ ప్రేమేందర్ రెడ్డికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పాలన మారలేదు : ఈటల రాజేందర్ - Etela Rajender Comments on Congress