ETV Bharat / politics

మోదీ గ్యారంటీలే అస్త్రం - లోక్​సభ పోరులో జోరుగా బీజేపీ ప్రచారం - LOK SABHA ELECTION 2024 - LOK SABHA ELECTION 2024

BJP Lok Sabha Election Campaign : లోక్​సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకుని తెలంగాణపై మరింత పట్టు సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ప్రచార వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా నియోజకవర్గాల్లో అభ్యర్థులు రోడ్​షోలు, సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ఓట్ల వేటను సాగిస్తోంది.

BJP Lok Sabha Election Campaign
BJP Lok Sabha Election Campaign
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 16, 2024, 7:16 AM IST

తెలంగాణపై పట్టుకోసం బీజేపీ తహతహ

BJP Lok Sabha Election Campaign : రాష్ట్రంలో బీజేపీ ఎంపీల గెలుపుతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమనే నినాదంతో ఆ పార్టీ జనంలోకి వెళ్తోంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో మెదక్​ ఎంపీ అభ్యర్థి రఘనందన్​రావు రోడ్​షో నిర్వహించారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​లపై తీవ్రస్థాయిలో రఘునందన్​రావు విమర్శలు చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసిన తన గెలుపు తథ్యమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లోని పార్లమెంటు నియోజకవర్గం పోలింగ్​ బూత్​ స్థాయి కార్యకర్తల సమ్మేళనంలో రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్​ పాల్గొన్నారు.

రైతులను ఆదుకునే ఏకైక ప్రభుత్వం బీజేపీనేనని ఎంపీ లక్ష్మణ్​ అన్నారు. పసుపు బోర్డు(Turmeric Board) ఏర్పాటుపై ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని గుర్తు చేశారు. అలాగే చెరుకు రైతుల సమస్యలు పరిష్కారం కావడానికి కృషి చేస్తామని చెప్పారు. అందుకే రెండోసారి పోటీ చేస్తున్న అర్వింద్​ను మళ్లీ గెలిపించాలని రైతులను కోరారు.

"ఈసారి బీజేపీ, ధర్మపురి వంశం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని బీజేపీ కార్యకర్తలు అందరికీ గర్వంగా చెప్పాలి. పసుపు బోర్డు తీసుకువచ్చే వరకు నేను విస్మరించను అని చెప్పిన అర్వింద్​, చివరికి దిల్లీలో ప్రధానమంత్రిని ఒప్పించి, మెప్పించి హోంమంత్రి అమిత్​ ద్వారా మంత్రులు అందరినీ కలిసి నిజామాబాద్​లో పసుపు బోర్డు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. చివరికి ప్రధాని ద్వారా పసుపు బోర్డును ప్రకటించారు. ఇచ్చిన మాటకు బీజేపీ ఎప్పుడూ కట్టుబడి ఉంది." - ధర్మపురి అర్వింద్​, నిజామాబాద్​ ఎంపీ అభ్యర్థి

2028లో 100కు పైగా సీట్లు గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం : ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి

Etela Rajender Fires on CM Revanth : ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ విమర్శలు చేశారు. నాయకులను ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారని(CM Revanth is Taking Other Party Leaders) ధ్వజమెత్తారు. గతంలో కేసీఆర్​ చేసిన తప్పులనే ఇప్పుడు సీఎంగా ఉండి రేవంత్​ రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు.

ప్రజలు రేవంత్​ను సీఎంగా చేసుకోవడానికి ప్రధాన కారణం పంటలు ఎండిపోకుండా చూస్తారని, అభివృద్ధి చేస్తారని భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ నాటి మాజీ సీఎం కేసీఆర్​ ప్రగతి భవన్​లో కూర్చుని ఏం చేశారో ఇప్పుడు రేవంత్​ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాగే మరోవైపు పీఆర్​టీయూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డి బీజేపీ అధ్యక్షుడు కిషన్​ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.

"గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్​ చేసిన తప్పులనే రేవంత్​ రెడ్డి ఇప్పుడు చేస్తున్నారు. ఇతర పార్టీల నాయకులను టార్గెట్​ చేసి పార్టీలోకి మార్పించుకున్నారో ఇప్పుడు అదే పరంపర ప్రస్తుత సీఎం రేవంత్​ రెడ్డి చేస్తున్నారు. ఇతర పార్టీలలో ఉన్న నాయకులను ప్రలోభపెట్టడం, వెల కట్టడం, బిల్లులు పెండింగ్​లో ఉన్న, పనులు కావాలన్నా లేదా ఇతరత్రా అవసరాలు ఉన్న కూడా వారిని ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా కొనసాగుతోంది." - ఈటల రాజేందర్​, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి

తెలంగాణలో గజదొంగలు పోయి - ఘరానా దొంగలు వచ్చారు : కిషన్‌రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి సమర్థుడు - కానీ కాంగ్రెస్​లో ఉంటే అసమర్థుడిగా మారిపోతాడు : ఎంపీ అర్వింద్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.