BJP Lok Sabha Election Campaign in Telangana : రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారానికి తగినంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో అధికార, ప్రతిపక్ష పార్టీల కంటే ముందుగానే బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్న కాషాయ శ్రేణులు బీఆర్ఎస్ వైఫల్యాలను(BJP Question to BRS) ఎండ గడుతున్నారు. బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలను అసెంబ్లీ ఎన్నికల నుంచే ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ విజయవంతమైనప్పటికీ తమకు అనుకూలంగా మలుచుకోవడంలో విఫలమైందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే అది కాస్త కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా పార్టీ ప్లాన్ చేస్తోంది.
ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) అంశం బీజేపీకు అస్త్రంగా దొరికింది. గత ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన నేతలందరి ఫోన్లు ట్యాప్ చేశారని ఇప్పటికే ఎన్నికల కమిషన్, పోలీస్ అధికారులకు రాష్ట్ర నాయకత్వం ఫిర్యాదులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వంపై కూడా అదే స్థాయిలో ఒత్తిడి తెస్తోంది. ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తుంది. సీబీఐ విచారణకు ఇవ్వకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ను కాపాడే ప్రయత్నం చేస్తోందనే ప్రచారాన్ని ముమ్మరం చేసి ఇరుకున పెట్టాలని చూస్తోంది. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ప్రభుత్వ భూముల అమ్మకం, మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం వంటి అంశాలను ప్రచార అస్త్రాలను సంధించాలని యోచిస్తోంది.
'ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలి'- గవర్నర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు
ఆరు గ్యారంటీలపై నిలదీత : అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల(Congress Six Guarantees) పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని బీజేపీ భావిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్న కాంగ్రెస్ వంద రోజులు పూర్తయినా హామీలన్నీ అమలు చేయలేదని బీజేపీ ప్రచారం చేయనుంది. మహిళలకు ఉచితంగా బస్సు(Free Bus For Women) మాత్రమే కల్పించిందని, 500కు గ్యాస్ మాత్రమే అందించి చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్‌పై ఇప్పటికే బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా ఎన్నో హామీలను కాంగ్రెస్ అమలుచేయాల్సి ఉందనే అంశాలను ఎత్తిచూపాలని కమలం నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టి ప్రజలను తమ వైపునకు తిప్పుకోవాలని భావిస్తోంది.
Telangana BJP Election Campaign : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జాతీయ స్థాయి నేతలు రాష్ట్రంలో ప్రచారానికి(BJP National Leaders Campaign in TS) రానున్నారు. ఈ అంశాలన్నింటినీ ప్రజలకు జాతీయ నేతలతో చెప్పించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఈ నెల 18న నోటిఫికేషన్ రానుండటంతో ప్రచారాన్ని మరింత వేగవంతం చేసేందుకు సన్నద్ధమవుతోంది. లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా బూత్ సమ్మేళనాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే చేవెళ్ల, హైదరాబాద్ పార్లమెంట్ బూత్ సమ్మేళనాలు ముగిశాయి. ఇవాళ భువనగిరి బూత్ సమ్మేళనం జరగనుంది.
రసవత్తరంగా లోక్‌సభ ఎన్నికల రాజకీయం - పోటాపోటీగా ప్రధాన పార్టీల ప్రచారం
'భయంతోనే ఎన్నికల్లో మళ్లీ హిందూ-ముస్లిం అస్త్రం'- బీజేపీపై కాంగ్రెస్ నేతలు ఫైర్