ETV Bharat / politics

ఎంపీ అభ్యర్థులపై బీజేపీ నేతల ఆసంతృప్తి - నాయకులను బుజ్జగించే పనిలో రాష్ట్ర నాయకత్వం - bjp leaders issue on mp candidates - BJP LEADERS ISSUE ON MP CANDIDATES

BJP Leaders unsatisfied on MP candidates : లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజారిటీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న కాషాయ పార్టీకి కొత్త తలనొప్పి వచ్చి పడింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకన్నా ముందే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీకి ఇప్పుడు అదే సమస్యగా మారింది. అధిష్ఠానం ప్రకటించిన నాలుగైదు స్థానాల్లో అసంతృప్తి రగులుకుంది. ఈ స్థానాల్లో అసంతృప్తులను బుజ్జగించే పనిలో రాష్ట్ర నాయకత్వం పడింది. అసంతృప్త నేతలు మాత్రం తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామంటున్నారు. దీంతో కమల దళంలో కలవరం మొదలైంది.

BJP Leaders on MP Candidates List
BJP Leaders unsatisfied on MP candidates
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 26, 2024, 8:37 PM IST

ఎంపీ అభ్యర్థులపై బీజేపీ నేతల ఆసంతృప్తి - నాయకులను బుజ్జగించే పనిలో రాష్ట్ర నాయకత్వం

BJP Leaders unsatisfied on MP candidates : రాష్ట్రంలోని 17 స్థానాల్లో 10 నుంచి 12 సీట్లు కైవసం చేసుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అభ్యర్థులను సైతం ఇతర పార్టీల కంటే ముందుగానే ప్రకటించింది. తమకు టికెట్ వస్తుందన్న ఆశాలపై నీళ్లు చల్లిన బీజేపీ జాతీయ నాయకత్వం, బీఆర్​ఎస్​ నేతలను పార్టీలో చేర్చుకొని టికెట్ కట్టబెట్టింది. పార్టీ బలోపేతం కోసం పని చేసిన తమకు కాకుండా గులాబీ నాయకులు, కార్యకర్తలను పార్టీలో చేర్చుకోవడం పట్ల కాషాయ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ అధిష్ఠానం ప్రకటించిన అభ్యర్థులకు సహకరించబోమని బాహాటంగానే చెబుతున్నారు.

రెబల్ అభ్యర్థిగా బరిలోకి : ఆదిలాబాద్‌లో సిట్టింగ్ ఎంపీ బాపూరావును కాదని బీఆర్​ఎస్​ నుంచి వచ్చిన గోడం నగేశ్‌కు టికెట్ ఇవ్వడంతో అసంతృప్తి రగులుకుంది. ఆదిలాబాద్‌లో తన వల్లే 4 ఎమ్మెల్యే స్థానాలు దక్కాయని, అయినా పార్టీ తనను పట్టించుకోలేదని సోయం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రచారం నడుస్తోంది. దీంతో సోయంను బుజ్జగించేందుకు రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దిగింది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బాపూరావుతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. అవసరం అయితే నేరుగా కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Leaders Dissatisfied on BJP MP Candidates : ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సోయం, ఆదివాసీ నేతలతో భేటీ తర్వాత భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలోనూ అరూరి రమేశ్​కు టికెట్ ఇవ్వడాన్ని స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. తమను కాదని బీఆర్​ఎస్​(BRS) నుంచి తీసుకొచ్చి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటని రాష్ట్ర నాయకత్వాన్ని నిలదీస్తున్నారు. వీరందరిని కలుపుకొని ఎన్నికలకు వెళ్లడమే ఇప్పుడు అరూరి ముందున్న సవాల్‌. రాష్ట్ర నాయకత్వం వీరితో మాట్లాడి పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

BJP Leaders on MP Candidates List : జహీరాబాద్‌లోనూ బీబీ పాటిల్‌(BB Patil)కు టికెట్ ఇవ్వడాన్ని బీజేపీలోని మరోవర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక్కడ జైపాల్‌రెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయన ఇంకా అసంతృప్తి వీడలేదు. బీఆర్​ఎస్​ నేతను తీసుకొచ్చి సీటు ఇవ్వడంపై పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మెదక్ సీటు ఆశించిన అంజిరెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎంపీ సీటు ఇస్తామన్న పార్టీ, ఎమ్మెల్యేగా ఓడిన రఘునందన్‌ రావు(Raghunandan Rao)కే టికెట్ ఇవ్వడం పట్ల అంజిరెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు.

టికెట్ కోసమే పార్టీలో చేరిన నేతకు ఝలక్ : మరోవైపు టికెట్ కోసమే పార్టీలో చేరిన నేతకు బీజేపీ షాక్ ఇచ్చింది. ఖమ్మం స్థానం ఆశించి జలగం వెంకటరావు కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు చేరిన నలుగురికి టికెట్‌ ఇచ్చినా వెంకటరావుకు మాత్రం పార్టీ ఝలక్ ఇచ్చింది. ఖమ్మంను తాండ్ర వినోద్ రావుకు ఇవ్వడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో జలగం ఉన్నారు. ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను రాష్ట్ర నాయకత్వం బుజ్జగిస్తోంది. రాష్ట్ర నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా, అసంతృప్త నేతలు అలక వీడతారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

టార్గెట్ @ 10సీట్లు - గెలుపే లక్ష్యంగా బీజేపీ పక్కా ప్లాన్ - జాతీయ నేతలతో ప్రచారం - Lok Sabha Elections 2024

తెలంగాణలో మిగిలిన 2 స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన - BJP MP Candidate List 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.