BJP Election Campaign Strategy In Telangana : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రధాని మోదీ రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించారు. ఒక వైపు అధికారిక కార్యక్రమాలతో పాటు బీజేపీ ఆధ్వర్యంలో అదిలాబాద్, సంగారెడ్డిలో నిర్వహించిన విజయ సంకల్ప సభల్లో పాల్గొని ఒక దఫా ప్రచారాన్ని ముగించారు. రానున్న రోజుల్లో ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda), ఇతర అగ్ర నేతల తాకిడి తెలంగాణకు భారీగా పెరగనుంది. రాష్ట్రంలో ప్రచారం హోరెత్తనుంది.
PM Modi Road Show in Secunderabad : ఇప్పటికే ప్రధాని రెండ్రోజుల టూర్ తో కాషాయ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కాగా ఎన్నికల షెడ్యూల్(Lok Sabha Election Schedule 2024) తర్వాత మోదీ టూర్‌కు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కానుంది. ఏయే తేదీల్లో పర్యటించాలనే అంశంపై కసరత్తు జరుగుతోంది. మోదీ మూడు పర్యటనల్లో భాగంగా చివరి విజిట్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ల పరిధిలో భారీ రోడ్ షో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో ఓటర్లను బీజేపీ వైపునకు తిప్పుకోవడంపై కాషాయ పార్టీ దృష్టి కేంద్రీకరించింది.
అసదుద్దీన్‌పై పోటీకీ మాదవీలతను బరిలోకి
సికింద్రాబాద్ స్థానం నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ స్థానం నుంచి అసదుద్దీన్ పై పోటీకి మాధవీలతను బరిలోకి దింపుతోంది. సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్(Congress Secunderabad MP Candidate) కూడా బలమైన నేతను(BJP MP Candidates) రంగంలోకి దించే అవకాశాలున్న నేపథ్యంలో మోదీ రోడ్ షో ఉండాలని రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే అసద్ కంచుకోటను ఢీకొట్టాలంటే హైదరాబాద్ స్థానంలోనూ రోడ్ షో ఉండాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఇదే - బిజీబిజీగా గడపనున్న కేంద్రమంత్రి
Amit Shah Telangana Tour : లోక్ సభ ఎన్నికలకు(Lok Sabha Polls) పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈనెల 12వ తేదీన తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా రానుండటంతో నాయకులు, కార్యకర్తల్లో మరింత జోష్ పెరగనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. 12వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా షా హాజరుకానున్నారు. దాదాపు 3 వేల మంది సోషల్ మీడియా వారియర్స్ ఈ మీటింగ్ కు అటెండ్ అయ్యే అవకాశముంది. లోక్ సభ ఎన్నికల్లో సోషల్ మీడియా వారియర్స్ ఎలా పని చేయాలి? ఏయే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి? ప్రజలను ఆకర్షించే పోస్టుల అంశంపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
Amit Shah Meeting In Telangana : అనంతరం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బూత్ అధ్యక్షులు, ఆ పైస్థాయి నేతలతో కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశంకానున్నారు. దాదాపు 25 వేల మంది ఈ మీటింగ్ కు హాజరవుతారని సమాచారం. ప్రతి బూత్ లో 370 ఓట్లు వచ్చేలా కృషి చేయాలని బూత్ అధ్యక్షులకు అమిత్ షా మార్గనిర్దేశనం చేయనున్నారు. అదేరోజు సాయంత్రం 17 పార్లమెంట్ల వర్కింగ్ గ్రూప్స్ మీటింగును నిర్వహించనున్నారు. దాదాపు ఐదు వందల మంది ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయ పార్టీ దూకుడు ఎంత మేరకు ఫలిస్తుందనేది వేచి చూడాలి.
లోక్‌సభ ఎన్నికల వేళ రసవత్తరంగా రాజకీయం - ఆపరేషన్ ఆకర్ష్‌తో బీజేపీ బిజీబిజీ