ETV Bharat / politics

కాంగ్రెస్​ హామీల అమలుపై ఏలేటి ప్రశ్నల వర్షం - ఘాటుగా స్పందించిన మంత్రి పొన్నం - BJP MLA Eleti Vs Minister Ponnam - BJP MLA ELETI VS MINISTER PONNAM

BJLP Leader Eleti Vs Minister Ponnam : శాసనసభలో కాంగ్రెస్ పార్టీ​ హామీల అమలుపై బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్​ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. అసెంబ్లీలో వివిధ పద్దులపై జరిగిన చర్చల్లో మాట్లాడిన ఆయన, ధరణి స్థానంలో భూమాతా పోర్టల్‌ తీసుకువస్తామన్నారని, ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు. పలు ప్రశ్నలకు గానూ స్పందించిన మంత్రి పొన్నం, తమ పాలనకు ఇంకా నాలుగేళ్ల వ్యవధి ఉందని, ఒక్కొక్కటిగా అమలు చేసి తీరుతామన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ధ్వజమెత్తారు.

BJLP Leader Eleti Comments on Congress Assurance
BJLP Leader Eleti Vs Minister Ponnam (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 30, 2024, 8:41 PM IST

BJLP Leader Eleti Comments on Congress Assurance : రైతు భరోసాకు చట్టబద్దత కల్పించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే రైతుల ఆత్మహత్యలు జరగకుండా నివారించాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీలో వివిధ పద్దులపై జరిగిన చర్చలో మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌ తీసుకువస్తామన్నారని ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు.

రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని ఇప్పటికీ కసరత్తు ప్రారంభించలేదని మండిపడ్డారు. పేదల భూములను ధరణి పోర్టల్‌ పేరుతో కేసీఆర్ కుటుంబం, బీఆర్​ఎస్ నేతలు తమ పేరు చేర్చుకున్నారని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని, భూముల లెక్కలను ప్రభుత్వం తేల్చిందా అని ప్రశ్నించారు. ధరణి పేరుతో జరిగిన రెండు లక్షల రూపాయల కుంభకోణం బయటకు తీయాలన్నారు.

"అవకతవకల, అక్రమాల ధరణి పోర్టల్​ ఏమైంది. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే ధరణి స్థానంలో భూమాత తెస్తామన్నారు. ఇంకా దాని ప్రశస్తి లేదు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూ సర్వే ఎప్పటి వరకు చేస్తుందో, భూ హక్కులు కోల్పోయినటువంటి రైతులందరికీ న్యాయం చేస్తామన్న విషయంపై స్పష్టత ఇవ్వాలి. కేసీఆర్ పాలనలో దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. మరి వాటిపై విచారణకు ఆదేశించేందుకు ప్రభుత్వంగా సిద్ధంగా ఉందా?" -ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత

సమగ్ర భూసర్వే ఎప్పటి వరకు చేస్తుందో స్పష్టం చేయాలి : తెలంగాణ ఏర్పడిన తర్వాత 40 శాతం దేవాదాయ వక్ఫ్‌ బోర్డు భూములను గత ప్రభుత్వం మింగిందని, ఆ కుంభకోణాలపై ప్రస్తుత ప్రభుత్వం సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని నిలదీశారు. ప్రతి 30 ఏళ్లకు ఒకసారి జరగాల్సిన సమగ్ర భూసర్వే జరగలేదన్న మహేశ్వర్​రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూ సర్వే ఎప్పటి వరకు చేస్తుందో స్పష్టం చేయాలన్నారు.

Minister Ponnam Reply to BJLP Leader Eleti Comments : మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్, తమ పాలనకు ఇంకా నాలుగున్నర యేళ్లు ఉందని, ఒక్కొక్కటిగా అమలు చేసి తీరుతామన్నారు. కాగా హైదరాబాద్​ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులెంత చెప్పగలరా అని ప్రశ్నించారు. హైదరాబాద్​ ఇన్​ఛార్జిగా తాను, నగర పరిధిలోని 15 మంది ఎమ్మెల్యేలతో కలసి కేంద్రం వద్దకు పోదామా అని అన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు. ఎనిమిది ఎమ్మెల్యేలను, ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణకు నిధులు కేటాయించలేదని ఆరోపించారు.

"కాంగ్రెస్ హామీల అమలుపై మాకు ప్రశ్నించడానికి ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. కానీ ముందుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి సమకూరిన లాభం ఏంటో చెప్పండి. నగర అభివృద్ధికి సైతం కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు. తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నా, ఏం లాభమో చెప్పాలి."-పొన్నం ప్రభాకర్, మంత్రి

పంచాయతీల్లో నిధులు లేక గ్రామాలు ఏడుస్తున్నాయి: కొత్త ప్రభాకర్​ రెడ్డి - telangana budget session 2024

మంత్రి కోమటిరెడ్డి Vs జగదీశ్ రెడ్డి - అసెంబ్లీ సాక్షిగా సవాళ్లు ప్రతిసవాళ్లు - KOMATIREDDY Vs JAGADISH REDDY

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.