Birth Day Wishes to KCR : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గవర్నర్, ముఖ్యమంత్రి, పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, కేసీఆర్(KCR) జన్మదినం సందర్భంగా ఆయనకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ కార్యాలయం నుంచి వచ్చిన ప్రతినిధి తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు పుష్పగుచ్ఛం, శుభాకాంక్షల లేఖను అందజేశారు.
తెలంగాణ జలాలు తీసుకెళ్దామనుకున్న స్వార్థ శక్తులకు ఈ సభ ఓ హెచ్చరిక : కేసీఆర్
CM Revanth Reddy Wish to KCR : కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించి, సభలో ప్రతిపక్ష నాయకుడిగా సభను సజావుగా నడిపేందుకు తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పథం వైపు నడిపేందుకు వారికి దేవుడు పూర్తిస్థాయి శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
KTR Wish to KCR Birth Day : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులతో మాజీ మంత్రి కేటీఆర్, కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన తరవాత కేసీఆర్ డాక్యూమెంటరీ వీక్షించారు. మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవితలు తన అధికార ఎక్స్ ఖాతాలో కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
KCR Birthday Celebrations: ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు.. రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు
CM KCR Birth Day Celebrations : నల్గొండలోని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం కేసిఆర్‌కు 70వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా చేసుకున్నారు. గుత్తా సుఖేందర్, జెడ్పీ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి, గుత్తా తనయుడు గుత్తా అమిత్ రెడ్డిలు కలిసి కేక్ కట్ చేసి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సాధించుకున్న రాష్ట్రాన్ని మన హక్కులను కూడా పరిరక్షించేలా కేసీఆర్‌కు ఆ భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకల(KCR Birth Day)ను వేములవాడలో నియోజకవర్గ ఇంచార్జ్ చెలిమడ లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మొక్కులను చెల్లించారు. ఆలయం ఎదుట కేక్ కోసి పండ్లు పంపిణీ చేశారు.
EX CM KCR : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. అనంతరం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. 'గిఫ్ట్ ఏ స్మైల్' కింద పేద మహిళలకు గృహాన్ని నిర్మించి ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా వేడుకలు చేసుకుంటున్నారు.
ప్రతిపక్ష నేత హోదాకు తగిన ఛాంబర్ కేటాయించాలి - స్పీకర్‌కు బీఆర్ఎస్ విజ్ఞప్తి