ETV Bharat / politics

అంబేడ్కర్‌ను అడుగడుగున అవమానిస్తున్న పార్టీ కాంగ్రెస్ : బండి సంజయ్‌ - Bandi Sanjay on Dalits - BANDI SANJAY ON DALITS

Bandi Sanjay on Dalits in Karimnagar : దేశంలో దళితులను అభివృద్ధి పథంలో నడిపింది బీజేపీనేనని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. కాంగ్రెస్‌ వారిని ఓటు బ్యాంక్‌గా వాడుకోవాలని చూస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో అంబేద్కర్‌ ఆలోచనలకు వ్యతిరేకంగా పని చేసిన పార్టీ కూడా హస్తం పార్టీనేనని అన్నారు. కరీంనగర్‌లో జరిగిన ఎస్సీ మోర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Bandi Sanjay Latest Comments
Bandi Sanjay on Dalits in Karimnagar
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 26, 2024, 4:04 PM IST

Bandi Sanjay on Dalits in Karimnagar : దేశంలోని దళితులకు తమ ప్రభుత్వంలోనే మేలు జరిగిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ తెలిపారు. అంబేడ్కర్‌ను అడుగడుగున అవమానిస్తున్న పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. కరీంనగర్‌ జిల్లాలోని పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సీ మోర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Bandi Sanjay Comments on Congress : దేశంలో దళితులకు బీజేపీ ప్రభుత్వంలోనే అత్యధికంగా గౌరవం లభించిందని బండి సంజయ్ అన్నారు. ఏకంగా రాష్ట్రపతి పదవిలోనే కూర్చోపెట్టామని గుర్తు చేశారు. పేదలకు గురించి ఆలోచిస్తూ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేశామని తెలిపారు. సంక్షేమ పథకాలు అందిస్తూ సంవత్సరానికి లక్షకు పైగా దళితులను వ్యాపారస్తులను చేస్తున్నామని పేర్కొన్నారు. అంబేడ్కర్‌ను అడుగడుగున అవమానిస్తున్న పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. ఆయన ఆలోచనలకు వ్యతిరేకంగా దేశంలో హస్తం పార్టీ పని చేసిందని వివరించారు. వారిని ఓటు బ్యాంక్‌గా వాడుకుందే తప్పా చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు.

కరీంనగర్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్‌ నామినేషన్ - BJP LEADER BANDI SANJAY NOMINATION

"అంబేడ్కర్‌ను అడుగడుగున అవమానిస్తున్న పార్టీ కాంగ్రెస్. ఆయన ఆలోచనలకు వ్యతిరేకంగా పని చేసింది. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుంది తప్పా కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు. అధికారంలోకి రావాలన్న కుట్రతో దళితుడిని సీఎం చేస్తా అని కేసీఆర్‌ అన్నారు. అన్ని రకాలుగా దళితులను మోసం చేసింది కేసీఆర్‌."- బండి సంజయ్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

Bandi Sanjay Fires on BRS : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయిన దళితులకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిందా అని బండి సంజయ్ ప్రశ్నించారు. గతంలో అధికారంలోకి రావాలన్న కుట్రతో దళితుడిని సీఎం చేస్తానని బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారని మండిపడ్డారు. అన్ని రకాలుగా దళితులను మోసం చేసింది బీఆర్‌ఎస్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం తాను చొరవ చూపిస్తేనే నిర్మాణం పూర్తి చేశారని తెలిపారు. గురువారం ఆయన కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంపై పూర్తి దృష్టి పెట్టారు.

అంబేడ్కర్‌ను అడుగడుగున అవమానిస్తున్న పార్టీ కాంగ్రెస్ బండి సంజయ్‌

నేను మాట్లాడితే దేవుళ్ల పేరిట రాజకీయం - మరి మీరు వేసే ప్రమాణాల సంగతేంటి? : బండి సంజయ్ - Bandi Sanjay Fires on Revanth Reddy

బీఆర్ఎస్‌, కాంగ్రెస్​ పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకొని - నన్ను ఓడించాలని ప్రయత్నిస్తున్నాయి : బండి సంజయ్ - lok sabha elections 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.