ETV Bharat / politics

కార్పొరేటర్‌ టు కేంద్రమంత్రి వయా కరీంనగర్ - బండి సంజయ్‌ రాజకీయ ప్రస్థానమిదీ - Bandi Sanjay Political Biography

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 9, 2024, 9:18 PM IST

Bandi Sanjay Oath as a Central Minister : ముచ్చటగా మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారాన్ని చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రం నుంచి ఇద్దరు బీజేపీ నాయకులకు మంత్రివర్గంలో చోటు దక్కింది. అందులో ఒకరు కిషన్​ రెడ్డి కాగా, మరొకరు బండి సంజయ్. రెండోసారి ఎంపీ బాధ్యతను చేపట్టిన సంజయ్​, తొలిసారి కేంద్రమంత్రిగా సేవలను అందించనున్నారు.

Bandi Sanjay Political Biography
Bandi Sanjay Oath as a Central Minister (ETV Bharat)

Bandi Sanjay Oath as a Central Minister : పన్నెండేళ్ల వయస్సులోనే రాజకీయాలపై ఆసక్తి చూపించి, రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​లో చేరారు. అక్కడ తాను చురుకుగా పని చేసి అందరి మన్ననలు పొందారు. అక్కడి నుంచి క్రమంగా ఎదుగుతూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా సేవలు అందించారు. ఈ పదవిలో ఉన్నప్పుడు మరింత చురుకుగా పని చేసి, రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించారు. అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆయనే కరీంనగర్​ నుంచి లోక్​సభ స్థానానికి ఎన్నికైన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్. అతని రాజకీయ జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Bandi Sanjay Political Career : బండి సంజయ్ 1971లో కరీంనగర్​లో జన్మించారు. బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్​లో స్వయం సేవకుడిగా పని చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్​ (ఏబీవీపీ)లో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, ది కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్​లో రెండు పర్యాయాలు (1994-1999, 1999-2003) డైరెక్టర్​గా పని చేశారు. ఎల్.కె. అడ్వానీ చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇంఛార్జీగా బాధ్యతలు నిర్వర్తించారు.

కేంద్రమంత్రి వర్గంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి చోటు - UNION MINISTRY TO BANDI SANJAY AND KISHAN REDDY

Bandi Sanjay Political Journey : కరీంనగర్ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్​గా, రెండోసారి అదే 48వ డివిజన్ నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. వరుసగా రెండు పర్యాయాలు కరీంనగర్​ బీజేపీ అధ్యక్షునిగా సేవలు అందించారు. 2019 ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబర్, అర్బన్ డెవలప్​మెంట్​ పార్లమెంట్ కమిటీ మెంబర్, టొబాకో బోర్డు మెంబర్​గా నియామకం అయ్యారు.

Bandi Sanjay as a Central Minister : 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 96 వేల పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. 2020లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా నియామకం అయ్యారు. 2023 జులైలో అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్​ని తప్పించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా 2.25 లక్షల ఓట్ల మెజారిటీతో రెండోసారి విజయం సాధించారు. రెండోసారి విజయం సాధించిన బండి సంజయ్​కు కేంద్ర మంత్రివర్గంలో తొలిసారి అవకాశం దక్కింది. కిషన్ రెడ్డి సహా ఈయనకూ కేంద్రమంత్రి పదవి దక్కింది.

అసెంబ్లీ పోరులో ఓడించినా - లోక్​సభ వార్​లో గెలిపించారు - తెలంగాణ ప్రజల విలక్షణ తీర్పు - BJP wins telangana elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.