AP Election Voting Percentage 2024 : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పురుషుల్లో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ (70.24%), మహిళల్లో విజయనగరం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు (64.21%)లకు అత్యధిక శాతం ఓట్లు వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (Association for Democratic Reforms) (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విశ్లేషణ పత్రాన్ని ఆ సంస్థ విడుదల చేసింది.
- శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర టీడీపీ అభ్యర్థి ఎం.ఎస్.రాజు (0.19%), ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి (0.47%) అత్యల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు.
- ఈ ఎన్నికల్లో టీడీపీకు 45.60%, వైఎస్సార్సీపీకు 39.37%, జనసేనకు 6.87%, బీజేపీకు 2.83%, కాంగ్రెస్‌కు 1.72%, నోటాకు 1.09%, బీఎస్పీకి 0.60%, సీపీఎంకు 0.13%, సీపీఐకి 0.04%, ఇతర పార్టీలకు 1.75% ఓట్లు పోలయ్యాయి.
- 175 మంది ఎమ్మెల్యేల్లో 22 మంది మహిళలు ఉన్నారు. మహిళా విజేతలందరికీ 40%కిపైగా ఓట్లు లభించాయి.
- శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో నోటాకు అత్యధికంగా 3.79% ఓట్లు పడ్డాయి. తర్వాతి స్థానాల్లో సాలూరు (3.63%), రంపచోడవరం (3.45%) ఉన్నాయి.