ETV Bharat / politics

కొవ్వూరు, నరసాపురంలో 5 గంటల్లో ఫలితాలు: సీఈవో మీనా - CEO Meena on Counting Arrangements

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 3, 2024, 3:23 PM IST

Updated : Jun 3, 2024, 3:37 PM IST

AP CEO Meena on Counting Arrangements: రాష్ట్రంలో ఎన్నికల కీలక ఘట్టం కౌంటింగ్​కు సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో మొత్తం 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా కౌంటింగ్​ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.

AP_CEO_Meena_on_Counting_Arrangements
AP_CEO_Meena_on_Counting_Arrangements (ETV Bharat)
కొవ్వూరు, నరసాపురంలో 5 గంటల్లో ఫలితాలు: సీఈవో మీనా (ETV Bharat)

AP CEO Meena on Counting Arrangements: రాష్ట్రంలో మొత్తం 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. అలాగే 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని, 26,473 మంది హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు వేశారని తెలిపారు. దీంతోపాటు 26,721 మంది సర్వీస్ ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేశారన్నారు. అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

నాలుగో తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని, 8.30 గంటలకు ఈవీఎంల కౌంటింగ్ మొదలవుతుందని తెలిపారు. కొన్ని చోట్ల లోక్​సభ కౌంటింగ్ హాల్స్ వద్ద పోస్టల్ ప్రత్యేకంగా లెక్కింపు జరుగుతుందని, వేరే హాల్​లో అక్కడ 8 గంటలకు ఈవీఏం కౌంటింగ్ ప్రారంభం అవుతుందన్నారు. పార్లమెంటు నియోజక వర్గాలకు 2,443 ఈవీఎం టేబుల్స్, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఉన్నాయని తెలిపారు. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుల్స్, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఉంటాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామన్నారు.

పిన్నెల్లిపై సుప్రీంకోర్టు ఆంక్షలు - కౌంటింగ్​ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆదేశం - SC on MLA Pinnelli Case

కౌంటింగ్ ప్రక్రియ పరిశీలనకు 119 మంది అబ్జర్వర్లను నియమించిందని, టేబుల్​కు మైక్రో అబ్జర్వర్లను నియమించిందన్నారు. అమలాపురం పార్లమెంటుకు 27 రౌండ్లు పడుతుందని, ఫలితాలు వచ్చేందుకు దాదాపు 9 గంటల సమయం పడుతుందని తెలిపారు. అలాగే రాజమండ్రి, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాల్లో 13 రౌండ్లు ఉన్నాయని, ఫలితాలు వచ్చేందుకు 5 గంటల సమయం పడుతుందన్నారు. భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంల్లో 26 రౌండ్​లు పడుతుందన్నారు. కొవ్వూరు, నరసాపురం ల్లో 5 గంటల్లో ఫలితాలు వస్తాయన్నారు.

అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. మీడియా కౌంటింగ్ ప్రక్రియను చిత్రీకరణ చేసుకోవచ్చన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్​లు అనుమతించేది లేదని తెలిపారు. మీడియాకు మాత్రం నిర్దేశించిన మీడియా సెంటర్ వరకూ మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లే అవకాశం ఉందన్నారు.

కౌంటింగ్ రోజు మద్యం దుకాణాలు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ముఖేష్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. స్టార్ హోటల్స్, రెస్టారెంట్లలోనూ మద్యం విక్రయాలు జరగవని తెలిపారు. ఎన్నికల రోజు, ఆ తర్వాత హింసాత్మక ఘటనల దృష్ట్యా 67 కంపెనీల సాయుధ భద్రత బలగాలను ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాల వద్ద శాంతి భద్రతల కోసం వినియోగిస్తున్నామన్నారు.

కౌంటింగ్ కేంద్రం పరిధిలో ప్రాంతాన్ని రెడ్​జోన్​గా ప్రకటించామన్నారు. కౌంటింగ్ రోజు హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. 185 హింస జరిగే ప్రాంతాల్లో గుర్తించి భద్రతా ఏర్పాట్లు చేశామని, 12వేల మందిని గుర్తించి బైండోవర్ చేశామని వెల్లడించారు. అలాగే పోలీసు పికెట్​లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్యూఆర్టి టీమ్​లు, కార్డెన్ సెర్చ్ చేస్తున్నామని, పోలింగ్ తరవాత 1,400 చోట్ల కార్డెన్ సెర్చ్ చేశామన్నారు.

సజ్జల, పేర్ని నానిని వెంటనే పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలి: ఎమ్మెల్సీ భూమిరెడ్డి - Bhumireddy on Sajjala Perni Nani

పుకార్లు కూడా పెద్ద ఎత్తున పెట్రేగెందుకు అవకాశం ఉందని, దాన్ని ఎదుర్కొనేందుకు కూడా చర్యలు చేపట్టామన్నారు. ప్రతి పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారని అన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వారు చూస్తారన్నారు. ఈ నేపథ్యంలో 67 కంపెనీల సాయుధ భద్రతా సిబ్బంది, 45వేలమంది పోలీసులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి చిన్న హింసాత్మక ఘటన జరగకుండా చూడటమే తమ బాధ్యత అన్న ఆయన ఇందుకోసం సీనియర్ అధికారులను నియమించినట్లు తెలిపారు.

కౌంటింగ్ ప్రక్రియలో ఏజెంట్​లు అల్లర్లు సృష్టించాలని ప్రయత్నం చేస్తే బయటకు పంపిస్తామని స్పష్టం చేశారు. కేసు పెట్టి జైలుకు కూడా పంపుతామన్నారు. సరైన కారణాల ఉంటే మాత్రమే రీపోల్​కు ఆదేశాలు ఇస్తామని వెల్లడించారు. మంగళవారం కౌంటింగ్ ఫలితాలు వచ్చిన అనంతరం ఊరేగింపులు చేసుకునేందుకు కూడా అవకాశం లేదని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

Last Updated : Jun 3, 2024, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.