ETV Bharat / politics

అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఇదే - బిజీబిజీగా గడపనున్న కేంద్రమంత్రి - Amit Shah Telangana Tour

Amit Shah Telangana Tour Schedule : ఈనెల 12న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణ రానున్నారు. హైదరాబాద్‌లో ఉదయం 11 గటంలకు బీజేపీ మూడు వేల మందితో నిర్వహించే సోషల్‌ మీడియా వారియర్స్‌ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అమిత్‌ షా రాష్ట్రానికి రానుండడంతో బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Amit Shah Telangana Tour
Amit Shah Telangana Tour
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 8, 2024, 3:12 PM IST

Updated : Mar 8, 2024, 6:15 PM IST

Amit Shah Telangana Tour Schedule : పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా(Amit Shah) ఈ నెల 12న తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్‌లో ఉదయం 11 గంటలకు బీజేపీ మూడు వేల మందితో నిర్వహించే సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. లోక్ సభ ఎన్నికల్లో సోషల్ మీడియా వారియర్స్(BJP Social Media Warriors) ఎట్లా పని చేయాలి, ఏయే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజలను ఆకర్షించేలా పోస్టులపై దిశా నిర్దేశం చేయనున్నారు.

ఈ సమావేశానంతరం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలతో షా సమావేశం కానున్నారు. 25 వేల మంది బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలు ఈ సమావేశానికి రానున్నారు. గ్రామాల్లో ప్రతి బూత్‌లో 370 ఓట్లు వచ్చేలా కృషి చేయాలని బూత్ అధ్యక్షులకు అమిత్ షా మార్గనిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 17 పార్లమెంట్ వర్కింగ్ గ్రూప్స్‌(Lok Sabha Working Group)తో సమావేశమవుతారు. పార్లమెంట్ వర్కింగ్ గ్రూప్స్ సమావేశంలో భాగంగా దాదాపు ఐదు వందల మందితో సమావేశమై పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా పని చేయాలి, పార్టీ విజయానికి కృషి చేయాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేస్తారు.

రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు చక్కగా అమలవుతాయి : అమిత్‌ షా

Amit Shah Telangana Tour Schedule 2024 : ఈసారి ఎలాగైనా తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్‌సభ స్ఠానాలు గెలవాలనే పట్టుదలతో బీజేపీ అధినాయకత్వం ఉంది. ఇందుకోసం ఒకవైపు పార్టీ అగ్రనేతలు తెలంగాణపై ఫోకస్‌ పెట్టి ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 17 పార్లమెంటు స్థానాలను కవర్‌ చేస్తూ బీజేపీ విజయసంకల్ప యాత్ర(BJP Vijaya Sankalpa Yatra)లు చేస్తోంది. మరోవైపు ఇతర పార్టీల్లోని అసంతృప్తి నేతలను పార్టీలోకి చేర్చుకుంటూ తన బలాన్ని మరింత పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇప్పటికే రెండు రోజులు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, సంగారెడ్డి జిల్లాలలో పర్యటించారు. బీజేపీ నిర్వహించిన బహిరంగ సభల్లో మోదీ తన ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని తీసుకొచ్చారు. అమిత్‌ షా పర్యటనలు వాయిదా పడుతూ వస్తున్నా, ఈ సారి మాత్రం టూర్‌ను రద్దు చేయకుండా షెడ్యూల్‌ ఖరారు చేశారు. పార్టీ నేతలకు, కార్యకర్తలకు పార్లమెంటు ఎన్నికల్లో ఎలా సన్నద్ధం కావాలో వారికి దిశానిర్దేశం చేయనున్నారు. 17 పార్లమెంటు స్థానాలే లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే పావులు కదుపుతోంది.

దిల్లీలో చంద్రబాబు, పవన్‌ - అర్ధరాత్రి వరకు కొనసాగిన చర్చలు - ఎన్డీఏలోకి టీడీపీ!

లోక్​సభ ఎన్నికల్లో 10 సీట్లే లక్ష్యంగా 'బీజేపీ క్లస్టర్ సమావేశాలు'

Last Updated : Mar 8, 2024, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.