ETV Bharat / politics

ఈ నెల 28న రాష్ట్రానికి అమిత్​ షా - ఒకేరోజు మూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటన - Amit Shah Telangana Tour Schedule

Amit Shah Telangana Tour Schedule 2024 : కేంద్రమంత్రి అమిత్​ షా తెలంగాణకు రానున్నారు. ఈ నెల 28న రాష్ట్రానికి రానున్న ఆయన, 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. పార్లమెంట్​ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Amit Shah Telangana Tour
Amit Shah Telangana Tour Schedule 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2024, 4:46 PM IST

Amit Shah Telangana Tour Schedule 2024 : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 28 రాష్ట్రానికి రానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్​లో మహబూబ్​నగర్​కు బయలుదేరి వెళ్లనున్నారు. మహబూబ్​నగర్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే క్లస్టర్ సమావేశానికి హాజరవుతారు. 1:50 గంటల నుంచి 2:40 వరకు మహబూబ్​నగర్ క్లస్టర్ సమావేశంలో పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇందుకోసం చేయాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పండుగ వేళ అమిత్ షా కుటుంబంలో తీవ్ర విషాదం

మహబూబ్​నగర్ క్లస్టర్ సమావేశం ముగించుకుని 2:55 గంటలకు కరీంనగర్ బయల్దేరుతారు. 3:55 గంటలకు కరీంనగర్​కు చేరుకోనున్న షా, పట్టణంలో నిర్వహించే కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. అనంతరం కరీంనగర్ సమ్మేళనం ముగించుకుని హైదరాబాద్​కు చేరుకుంటారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని జేఆర్సీ కన్వెన్షన్​లో బీజేపా ఆధ్వర్యంలో నిర్వహించే మేధావుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సాయంత్రం 6:15 గంటల నుంచి 7:05 గంటల వరకు మహిళా మేధావులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. అనంతరం ఒక్క రోజు రాష్ట్ర పర్యటన ముగించుకుని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాత్రి 7:45 గంటలకు దిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.

అమిత్​ షా తెలంగాణ టూర్​ షెడ్యూల్​ ఇదే

  • మధ్యాహ్నం 1.05 గంటలకు శంషాబాద్​ విమానాశ్రయానికి చేరిక
  • అక్కడి నుంచి హెలికాప్టర్​లో నేరుగా మహబూబ్​నగర్​కు పయనం
  • 1:50 నుంచి 2:40 వరకు మహబూబ్​నగర్ క్లస్టర్ సమావేశానికి హాజరు
  • సమావేశం అనంతరం 2:55 గంటలకు కరీంనగర్​కు పయనం
  • 3:55 గంటలకు కరీంనగర్​కు చేరుకుని కార్యకర్తల సమ్మేళనానికి హాజరు
  • కరీంనగర్ నుంచి నేరుగా హైదరాబాద్​కు చేరిక
  • సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో మేధావుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు
  • సాయంత్రం 6:15 గంటల నుంచి 7:05 గంటల వరకు మహిళా మేధావులతో సమావేశం
  • రాత్రి 7:45 గంటలకు దిల్లీకి తిరుగు ప్రయాణం

తెలంగాణలో 10కి పైగా ఎంపీ సీట్లే లక్ష్యంగా పనిచేయండి : అమిత్​ షా

'వర్గ విభేదాలు వదిలి పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం కండి' - రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్​ షా వార్నింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.