30 crores of gold Case : శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్నికల తనిఖీలో భాగంగా బెంగళూరు నుంచి అనంతపురానికి తరలిస్తున్న రూ. 30 కోట్ల విలువ చేసే బంగారం వజ్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం తరలించడానికి అనుమతులు ఉన్నప్పటికీ జీఎస్టీ చెల్లింపుల విషయంలో సమర్పించిన పత్రాలకు వాస్తవంగా ఉన్న బంగారాన్ని మదింపు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రూ. 50 వేలకు మించి డబ్బులు, ఇతర విలువైన వస్తువులు తరలించాలంటే అందుకు కారణాలు తెలపాలి. వాటి సంబంధించిన పత్రాలను చూపాలి. లేదంటే ఎన్నికల విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందికి చిక్కితే ఇక అంతే సంగతలు. అలాంటిది, నిన్న శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ మెుత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, స్వాధీనం చేసుకున్న బంగారానికి సంబంధించి సరైన పత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ భారీ మెుత్తంలో బంగారం తరలిస్తున్న నేపథ్యంలో ఆ బంగారానికి సంబంధించిన జీఎస్టీల చెల్లింపుల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నేపథ్యంలో జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి విచారణ చేస్తున్నారు.
వాహనాల తనిఖీల్లో రూ 5.73 కోట్ల విలువైన బంగారం పట్టివేత
బీవీసీ అనే ఏజెన్సీ లలిత జ్యువెలర్స్, మలబార్ గోల్డ్ షోరూమ్‌లకు బంగారాన్ని సరఫరా చేస్తుంది. అందులో భాగంగా ఎప్పటిలాగే నిన్న కూడా బెంగళూరు నుంచి అనంతపురం, బళ్లారిలో ఉన్న లలిత జ్యూవెలర్స్, మలబార్ గోల్డ్‌కు, బంగారం తరలిస్తున్నట్లు బీవీసీ ఏజెన్సీ సిబ్బంది తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో భద్రతా సిబ్బంది బంగారాన్ని తనిఖీ చేసినట్లు తెలిపారు. కానీ, ఆ బంగారం, వజ్రాలకు సంబంధించి మెుత్తం 194 బిల్లులు ఉన్నట్లు తెలిసింది. అధికారులు మాత్రం తమ వద్ద ఉన్న బిల్లులు వాస్తవంగా ఉన్న బంగారాన్ని అంచనా వేస్తున్నారు.
మెుత్తం నాలుగు పెట్టేల్లో బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకూ రెండు పెట్టెల్లో ఉన్న బంగారానికి సంబంధించిన జీఎస్టీ విలువను అంచనా వేసినట్లు తెలిసింది. మరో రెండు పెట్టెల్లో ఉన్న బంగారానికి సంబంధించి జీఎస్టీ విలువను అంచనా వేయనున్నారు. ఈ తనిఖీల్లో ఎన్నికల సిబ్బంది, స్థానిక పోలీసులు, కేంద్ర రక్షణ బలగాలు పాలుపంచున్నాయి. ప్రస్తుతం చిలమత్తూరు పోలీస్ స్టేషన్లో అధికారులు బంగారాన్ని లెక్కిస్తున్నారు. ఆభరణాలు, వెండి, వజ్రాల విలువ దాదాపు 30 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి బీవీసీ ఏజెన్సీ సిబ్బంది 194 బిల్లులను అధికారులకు సమర్పంచారు.
స్థిరంగా బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే? - Gold Rate Today March 25th 2024