హోవార్డ్ మోడల్ స్కూల్లో ఘనంగా గణతంత్ర వేడుకలు - హోవార్డ్ మోడల్ స్కూల్
భారత 75వ గణతంత్ర వేడుకలను.. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లోని "హోవార్డ్ మోడల్ స్కూల్"లో ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకానికి వందనం సమర్పించి, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని వివరించిన వక్తలు.. రాజ్యాంగ నిర్మాతలను శ్లాఘించారు. అనంతరం.. స్వాతంత్య్ర సంగ్రామం సహా వివిధ రాష్ట్రాల రాజధానులు, పర్యాటక ప్రదేశాలు, భాషలు, ఆహార అలవాట్లపై విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. వేడుకల్లో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Published : Jan 26, 2024, 12:46 PM IST
|Updated : Feb 7, 2024, 4:47 PM IST
Last Updated : Feb 7, 2024, 4:47 PM IST