స్పెషల్ 'రామా బ్లూ' చీరలో నిర్మల- వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డ్ - Union Budget

Nirmala Sitharaman Budget Sarees : పార్లమెంటులో వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ రికార్డును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ సమం చేశారు. అయితే, గతంతో పోలిస్తే ఈసారి ఆమె తన ప్రసంగాన్ని గంటలోపే ముగించారు. మరోవైపు బడ్జెట్తో పాటు నిర్మలాసీతారామన్ చీరలు సైతం అప్పటినుంచి ప్రత్యేకంగానే నిలుస్తున్నాయి. 2019లో ఆర్థికమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు చేనేత చీరే ధరిస్తున్నారు.

Published : Feb 1, 2024, 4:00 PM IST