ETV Bharat / opinion

గ్రూప్​ -1 పరీక్షకు నోటిఫికేషన్ వచ్చేసింది - మరి ప్రిపరేషన్​ ఎలా ఉండాలి? - TSPSC New Group 1 Notification

TSPSC New Group 1 Notification Released Today Prathidwani : సుదీర్ఘ నిరీక్షణ, ఉత్కంఠలకు తెర దించుతూ గ్రూప్​-1 ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్​ను తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్ ఇటీవల​ విడుదల చేసింది. 503 పోస్టుల పాత నోటిఫికేషన్​ రద్దు చేస్తూ, 563 పోస్టులతో కొత్త ప్రకటన వెలువరించింది. ఈ అంశాలపైనే నేటి ప్రతిధ్వని.

TSPSC New Group 1 Notification
Prathidwani
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2024, 11:06 AM IST

TSPSC New Group 1 Notification Released Today Prathidwani : సుదీర్ఘ నిరీక్షణ, ఉత్కంఠలకు తెర దించుతూ గ్రూప్​-1 ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్​ను తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ విడుదల చేసింది. 503 పోస్టుల పాత నోటిఫికేషన్​ రద్దు చేస్తూ 563 పోస్టులతో కొత్త ప్రకటనను టీఎస్​పీఎస్సీ వెలువరించింది. మే-జూన్​లో ప్రిలిమ్స్​, సెప్టెంబరు- అక్టోబరులో మెయిన్స్​ అని షెడ్యూల్​ కూడా వెల్లడించింది. మరిక గ్రూప్స్​ పరీక్షలకు అడ్డంకులన్నీ తొలగిపోయినట్లేనా? పాత-కొత్త నోటిఫికేషన్లలో ఎలాంటి మార్పులు చేశారు. టీఎస్​పీఎస్సీ ఇచ్చిన సిలబస్​ ఎలా ఉంది అందుకు అనుగుణంగా అభ్యర్థుల ప్రిపరేషన్​, ప్లానింగ్​ ఎలా ఉంటే మేలు? అనే అంశాలపై నేటి ప్రతిధ్వని.

TSPSC Group 1 Notification Cancelled : 2022 ఏప్రిల్​ 26న 503 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్​ను రద్దు చేస్తూ టీఎస్​పీఎస్సీ మళ్లీ పోస్టులు పెంచి 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్​ను విడుదల చేసింది. అంతకు ముందు 2022లో గ్రూప్​-1 నోటిఫికేషన్​ విడుదల చేసి ప్రిలిమ్స్​ను నిర్వహించింది. అయితే పేపర్​ లీకేజీ కారణంగా ఆ పరీక్షను రద్దు చేసి రెండోసారి ప్రిలిమ్స్​ను టీఎస్​పీఎస్సీ నిర్వహించింది. కానీ పరీక్ష నిర్వహణలో సరైన నియమ నిబంధనలు పాటించలేదని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా ఆ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పును ఇచ్చింది.

వెంటనే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ టీఎస్​పీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ వెంటనే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో టీఎస్​పీఎస్సీ సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్న అప్పీలను వెనక్కి తీసుకుంది. తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ విజ్ఞప్తితో సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో పాత గ్రూప్​-1 నోటిఫికేషన్​ను రద్దు చేస్తున్నట్లు టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. అయితే అంతకు ముందు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం 60 పోస్టులను అదనంగా చేర్చింది. ఈ పోస్టులను పాత నోటిఫికేషన్​లో కలపాలా లేక వేరే నోటిఫికేషన్​ ఇవ్వాలా అనే సందిగ్ధంలో టీఎస్​పీఎస్సీ పాత నోటిఫికేషన్​ రద్దు చేయగానే ఆ పోస్టుల్లో కలిపి కొత్త నోటిఫికేషన్​ ఇవ్వాలని టీఎస్​పీఎస్సీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నోటిఫికేషన్​లో పరీక్ష తేదీలు, సిలబస్​, ఫీజు వంటివి ఉన్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.