Prathidwani On Seasonal Diseases : రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల వాననీరు ఇల్లు, కాలువలు, బావుల్లోకి పోటెత్తుతోంది. దీంతో గాలి, నీరు కాలుష్యం బారిన పడుతున్నాయి. ఫలితంగా సీజనల్ వ్యాధులు విజృంభించే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే జిల్లాల్లో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే రోగులసంఖ్య పెరుగుతోంది.
పరిస్థితి చేయిదాటి పోకూడదంటే ప్రజలు ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. ఈ పరిస్థితుల్లో వైద్య ఆరోగ్యశాఖ తీసుకోవాల్సిన చర్యలేంటి? అంటువ్యాధులు, విషజ్వరాలు ప్రబలకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిన్నారులు, వృద్ధులు, మహిళల ఆరోగ్యరక్షణకు చేపట్టాల్సిన చర్యలేంటి? అనే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.