ETV Bharat / opinion

వైఎస్సార్సీపీ పాలనలో గాడితప్పిన రేషన్ వ్యవస్థ - పేదల ఆహార భద్రతకు ఏం చేయాలి? - Pratidwani on Ration Irregularities

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 3, 2024, 12:12 PM IST

Pratidwani : వైఎస్సార్సీపీ హయాంలో అధికారమే అండగా అడ్డదారుల్లో వేలాది టన్నులు బియ్యం పోర్టుల నుంచి విదేశాలకు, పప్పులు ఇతరాలు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోయాయి. పేదలకు అందే సరకుల సంచి చిన్నదిగా మారిపోగా దళారీలు, దొంగల ముఠాలకు అదునుగా మారింది. ఎన్డీఏ కొలువుదీరిన నేపథ్యంలో ఆ వ్యవస్థను అక్రమార్కుల చెర విడిపించి పేదల ఆహార భద్రతకు పెద్దదిక్కుగా మార్చడం ఎలా. దీని గురించి నేటి ప్రతిధ్వనిలో తెలుసుకుందాం.

Pratidwani
Pratidwani (ETV Bharat)

Pratidwani: రాష్ట్రంలో ఐదు సంవత్సరాల వైఎస్సార్సీపీ పాలనలో పూర్తిగా గాడితప్పి సర్వ భ్రష్టంగా మారిన వ్యవస్థల్లో ముందుంటుంది ప్రజాపంపిణీ. ఇంటి వద్దకే రేషన్ పంపిణీ దేవుడెరుగు ఏ నెలకు ఆ నెల పేదలకు అందే సరకుల సంచి చిన్నదిగా మారిపోగా దళారీలు, దొంగల ముఠాలకు అదో కల్పతరువుగా మారింది. ఆ మాఫియా వందలు, వేల కోట్ల రూపాయలకు పడగలెత్తగా అవసరానికి అందాల్సిన సరకులు లేక, ఆకలి బాధలు తీరక అల్లాడిపోయారు పేదలు.

అధికారమే అండగా అడ్డదారుల్లో వేలాది టన్నులు బియ్యం పోర్టుల నుంచి విదేశాలకు, పప్పులు ఇతరాలు బ్లాక్‌ మార్కెట్‌కు తరలి పోయాయి. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలోనైనా ఆ వ్యవస్థను అక్రమార్కుల చెర విడిపించి పేదల ఆహార భద్రతకు పెద్దదిక్కుగా మార్చడం ఎలా? ఈ అంశాలపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం. ప్రతిధ్వని చర్చలో పి. జమలయ్య, పౌరసరఫరాల వ్యవహారాల నిపుణుడు మరొకరు సీహెచ్‌ బాబురావు, పట్టణ పౌరసంఘాల సమాఖ్య కన్వీనర్ పాల్గొన్నారు.

కొత్త నేర న్యాయ చట్టాలతో ఎలాంటి మార్పులొస్తాయి ? - Pratidhwani on New Criminal laws

ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రేషన్ బియ్యం అక్రమాల గురించే చర్చ జరుగుతోంది. వేల టన్నుల బియ్యం పట్టుబడుతున్నాయి. వాటికి మూలం ఎక్కడ? గడిచిన ఐదేళ్లుగా రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది? ప్రజా ప్రభుత్వంలో ఈ వ్యవస్థ ప్రక్షాళన ఎక్కడ ప్రారంభం కావాలి? ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి తనిఖీల్లో తూనికల్లో కూడా పలు అక్రమాలు వెలుగు చూశాయి. వాటి నుంచి పౌరసరఫరాల వ్యవస్థ లబ్దిదారులకు రక్షణ ఎలా? రేషన్ దుకాణాలు అంటే కేవలం బియ్యం, పంచదార, ఏవో కొన్ని పప్పులకే పరిమితమా? ప్రజల వాస్తవిక అవసరాలకు తగిన రీతిలో దీనిని తీర్చిదిద్దడానికి ఏం చేయాలి.

ఎంతోకాలంగా పౌరసరఫరాల వ్యవస్థ వ్యవహారాలను దగ్గరగా పరిశీలిస్తున్నారు కావున దీనిలో సంస్కరణల దిశగా ఆదర్శంగా తీసుకోదగిన నమూనాలు ఏవైనా ఉన్నాయా? అక్రమాలు అరికట్టడంతో పాటు ఇంకా అర్హత ఉండి ప్రజాపంపిణీ వ్యవస్థ పరిధిలోకి రానివారి కోసం ఏం చేయాలి? రేషన్‌కార్డుల జారీ విషయంలో కొత్తప్రభుత్వం ముందున్న కర్తవ్యమేంటి? ప్రజలకు ఆహార భద్రత, వారి జీవించే హక్కు కాపాడడం, ధరల నుంచి రక్షణలో పౌరసరఫరాల వ్యవస్థ పాత్ర ఏమిటి? ముఖ్యంగా దీంతో ధరల మంట నుంచి ఎలా రక్షించవచ్చు? బియ్యం, పంచదార, పప్పులు ఇలా పేదలకు చెందాల్సిన ఆహార పదార్థాల్ని దోచుకున్న దొంగలపై ఎలాంటి చర్యలు ఉండాలి. మరోసారి అలాంటి వాటికి ఆస్కారం లేకుండా రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థలో శాశ‌్వత మార్పుకోసం ఏ విధమైన సంస్కరణలు తీసుకుని వస్తే మేలు జరుగుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.