Pratidwani: హోరాహోరీగా సాగుతోన్న సార్వత్రిక సమరంలో జాతీయ రాజకీయాల నాడి ఎలా ఉంది? మొత్తం ఏడు దశలకు సంబంధించి ఎన్నికల నిర్వహణలో ఇప్పటికే 4 దశల పోలింగ్ పూర్తయింది. సగానికి పైగా లోక్‌సభ స్థానాల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. మరి ఆ పోలింగ్ సరళిలు ఇచ్చిన సంకేతాలు ఏమిటి? మిగిలిన మూడు దశల్ని ఏ ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి? ఎన్డీఏ, ఇండియా కూటముల్లో మిషన్ 270 ప్లస్ రేసులో ఎవరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు అందరిలో జరుగుతోన్న చర్చ ఇదే. ఇదే అంశంపై చర్చించడానికి జాతీయ రాజకీయాలపై నిష్ణాతులైన ఇద్దరు విశ్లేషకులు మనతో ఈ రోజు ఉన్నారు. వారి ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకుందాం. చర్చలో పాల్గొంటున్న వారు జాతీయ రాజకీయాలపై వ్యాసకర్త చలసాని నరేంద్ర, సీనియర్ జర్నలిస్ట్ దామోదర్ ప్రసాద్ చెప్పబోతున్నారు. కేంద్ర రాజకీయ విశేషాలపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కొత్త ప్రభుత్వం వస్తే ఐదేళ్ల అరాచకాలకు భారీ మూల్యం చెల్లించక తప్పదా? - Prathidwani on YSRCP Attacks
ప్రధాన పార్టీల బలాబలాలు గురించి చూద్దాం. గత లోక్‌సభ ఎన్నికల్లొ బీజేపీ 303 స్థానాలు సాధించింది. ఈసారి సొంతంగా ఎన్ని గెలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు? బీజేపీ సొంతంగా 400 స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం దేశంలో పరిస్థితి అందుకు అనుకూలంగా ఉందా? నిజానికి ఈసారి ఎన్నికల్లో అందరి దృష్టి కేంద్రీకృతమైన మరో రెండు ప్రధానాంశాలు. మోదీ మ్యాజిక్, రామమందిర నిర్మాణం పూర్తి. ప్రత్యేకించి వీటి ప్రభావం ఓటర్లపై ఎలా కనిపిస్తోంది? ఉత్తరాదిలో ఎన్డీయే, ఇండియా కూటముల అవకాశాలు, ప్రతికూలతలు ఎలా ఉన్నాయి?
ఓటుతో తలరాత మార్చుకో - రాష్ట్ర భవిష్యత్ తీర్చిదిద్దుకో - PRATHIDWANI ON One VOTE VALUE
హిందీ బెల్ట్‌లో కానీ, గతంలో అత్యధిక స్థానాలు సాధించిన రాష్ట్రాల్లో గానీ ఈసారి బీజేపీ దాని భాగస్వామ్య పక్షాలకు ఏ మేరకు గెలుపు అవకాశాలు ఉన్నాయి? దక్షిణాదిలో ఎన్డీయే, ఇండియా కూటమిలకు ఉన్న అవకాశాలేంటి? తెలంగాణ, ఏపీలో సీట్లు పెంచుకోవటం ద్వారా బీజేపీ దక్షిణాదిలో బలాన్ని పెంచుకుంటోంది అని భావించవచ్చా? ఎన్డీయో, ఇండియా ఈ రెండు కూటముల్లోని భాగస్వామ్య పక్షాలను కూడా మనం కలిపి చూస్తే జూన్ 4 తర్వాత కేంద్రంలో ఎటువంటి దృశ్యం మీకు కనిపిస్తోంది? ఏం జరిగే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
రికార్డు స్థాయిలో నమోదైన పోలింగ్ - ఎన్డీయేకు 130-140 అసెంబ్లీ సీట్లు? - OPINION ON ANDHRA ELECTIONS