Pratidwani: విదేశీ విద్య అనేది యువత కల. దాని కోసం సప్త సముద్రాలు దాటి అమెరికా, బ్రిటన్ , ఆస్ట్రేలియా, కెనడా, యూరప్ వంటి సుదూర తీరాలకు చేరుతుంటారు. రెండేళ్లు కష్టపడి ఎంఎస్ చేస్తే చాలు ఏదో మంచి ఉద్యోగం సంపాదించవచ్చు. లైఫ్ సెటిల్ అవుతుంది అనుకుంటారు. అందుకే అప్పులు చేసి మరీ అమెరికా విమానం ఎక్కుతూంటారు. కానీ, అంతర్జాతీయ పరిస్థితులు మారాయి. గతంతో పోలిస్తే విదేశాల్లో ఉద్యోగావకాశాలు తగ్గాయి.
ఇంటర్న్‌షిప్‌లు కూడా దొరకటం కష్టంగా మారింది. మరోపక్క వీసా చిక్కులు ఉండనే ఉన్నాయి. దీంతో కొంతమంది విద్యార్థులు స్వదేశీ బాట పడుతున్నారు. కొత్తగా వెళ్లాలనుకునే విద్యార్థులు అయోమయంలో ఉన్నారు? అసలు విదేశీ విద్యకు ఉన్న అవకాశాలేంటి? సవాళ్లేంటి అనేది నేటి నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం. ముందుగా చర్చలో గ్లోబల్ ట్రీ డైరెక్టర్ ఎ.శుభకర్, వరల్డ్‌వైడ్ ఎడ్యూ కన్సల్టెంట్స్ సీఈవో వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రికార్డు స్థాయిలో నమోదైన పోలింగ్ - ఎన్డీయేకు 130-140 అసెంబ్లీ సీట్లు? - OPINION ON ANDHRA ELECTIONS
అమెరికాలోని స్థానిక పరిస్థితులు కారణంగా అక్కడికి ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థులు కొంత ఇబ్బందులు పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. దానికి కారణాలేంటి? అమెరికాలోని చాలా కంపెనీలు భారతీయ విద్యార్థుల కంటే అమెరికన్ల వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు ఎందుకని? అతిపెద్ద టాలెంట్ పూల్‌ను కాదని అమెరికన్ కంపెనీల వైఖరిలో ఈ మార్పునకు కారణమేంటి.
ఎక్కువమంది విద్యార్థులు అమెరికానే తొలి ప్రాథాన్యంగా పెట్టుకోవటం వలన అక్కడ అవకాశాలు ఏవైనా సన్నగిల్లుతున్నాయంటారా. ఎన్నో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి దేశంలో కాని దేశంలో వ్యయప్రయాసలకోర్చి కోర్సులు పూర్తి చేసిన తర్వాత కీలకమైన ఇంటర్న్‌షిప్ లభించక పోతే తర్వాత వాళ్లు జాబ్ మార్కెట్‌లో నిలబడేది ఎలా? భారతీయ విద్యార్థుల ముందున్న మార్గమేంటి?
కొత్త ప్రభుత్వం వస్తే ఐదేళ్ల అరాచకాలకు భారీ మూల్యం చెల్లించక తప్పదా? - Prathidwani on YSRCP Attacks
ఎల్ల వేళల డిమాండ్ ఉండే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథమెటిక్స్ - స్టెమ్ కోర్సులు చేసిన వారికి కూడా ఇంటర్న్‌షిప్‌లు, కొలువులు దొరకడం గగనంగా మారింది. ఇది తాత్కాలికమేనా? లేదంటే మన విద్యార్థుల కోర్సుల ఎంపికలో మార్పులు చేసుకోవాలంటారా? అమెరికాతో పాటు ఉన్న విద్య కోసం భారతీయ విద్యార్థులు ప్రధానంగా దృష్టి సారించే బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాల్లో ఎలాంటి పరిస్థితులున్నాయి.
అలానే విదేశీ విద్యకు కొత్త గమ్యస్థానాలుగా మారు తున్న ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, యూఏఈల పరిస్థితి ఏమిటి? యూరప్ దేశాల్లో చదవాలి, అక్కడ స్థిరపడాలి అనుకునే విద్యార్థులు ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలి? ఏఏ రంగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి? దానికి కావాల్సిన సన్నద్ధత ఎలా ఉండాలి? విదేశీ విద్య కోసం ఎక్కువ రుణాలు చేసే స్థోమత లేని ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రభుత్వరంగంలో, లేదా తక్కువ ఫీజులతో ఏఏ దేశాల్లో విద్యావకాశాలు ఉన్నాయి?
జాతీయ రాజకీయాలపై ప్రజల నాడి ఎలా ఉంది? - కూటముల అవకాశాలు, ప్రతికూలతలెలా ఉన్నాయి?