Pratidhwani : పేదల ఆకలి తీర్చే పథకం మళ్లీ ప్రాణం పోసుకుంది. అన్నార్తుడి కడుపు నింపే అన్నక్యాంటీన్ల పున:ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగానే ఈ కీలక హామీ అమల్లోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నిరుపేదలు, కార్మిక, శ్రామికవర్గాలకు తక్కువ ఖర్చుతోనే 3 పూటలా అన్నం పెట్టాలనే సంకల్పంతో అన్నీ సంసిద్ధం చేశారు. ప్రజల ఆకలి తీర్చడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం కావాలన్న మహాత్ముడి బాటలో ఒకేసారి 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. మరి, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించిన అన్నా క్యాంటిన్లు ఎలా శ్రమజీవుల ఆకలి తీర్చింది? 5ఏళ్ల జగన్ పాలనలో ఏం జరిగింది? ఇకపై అన్నక్యాంటీన్లు పేదలందరికీ ఏం సేవలు అందించనున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు సీనియర్ పాత్రికేయులు విక్రమ్ పూల, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డూండి రాకేష్.
అన్న క్యాంటీన్లు పునఃప్రారంభానికి సర్వం సిద్ధం - Reopening of Anna Canteens
అన్న క్యాంటీన్ల పున:ప్రారంభం ద్వారా ఎంతమంది పేదలకు ప్రయోజనం చేకూరనుంది? గత ప్రభుత్వ హయాంలో ఎంతమంది అన్నక్యాంటీన్ల సేవలు ఉపయోగించుకున్నారు? పేదల ఆకలి తీర్చడం ప్రభుత్వాల తొలి ప్రాధాన్యం కావాలన్న మహాత్ముడి స్ఫూర్తితో నాడు మొదలైన అన్నక్యాంటీన్లు జగన్ ప్రభుత్వం ఎందుకు మూసివేసింది? ఆ అయిదేళ్లు ఏం జరిగింది? పేదరికం నిర్మూలనలో అన్న క్యాంటీన్లు వంటి కార్యక్రమాల భాగస్వామ్యం ఏమిటి? ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వీటి విషయంలో ఏం ఆలోచిస్తున్నారు?
జగన్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా గత ప్రభుత్వ సమయంలో కొంతమంది మనసున్న వాళ్లు, తెలుగుదేశం నాయకులు అన్నక్యాంటీన్లు నడిపారు. వాళ్ల అనుభవాలు ఏమిటి? మలి విడతలో మొత్తం అన్ని అన్నక్యాంటీన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది? వీటి నిర్వహణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది? ఇన్నిలక్షలమందికి, కోట్లాదిభోజనాలు, అల్పహారం అందించడానికి ప్రభుత్వం అన్నక్యాంటీన్ల బాధ్యతలు అప్పగించిన హరేకృష్ణ సంస్థ వాటి నిర్వహణకు ఎలా సన్నద్ధమవుతోంది? వీటన్నింటికీ సమాధానం సహా అన్న క్యాంటీన్ సేవల ఉపయోగాలను ఈ ప్రతిధ్వని కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం.