Pratidhwani On TG Future City : అవకాశాల గమ్యస్థానం హైదరాబాద్ మహానగరానికి అనుబంధంగా మరో నవనగరం నిర్మాణం కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా ప్రణాళికాబద్ధమైన పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా ఫ్యూచర్ సిటీని తెరపైకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.
రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ భావినగరంలో ప్రాథమిక వసతులు, మౌలిక సదుపాయాలు కల్పనకు రెవెన్యూ, విద్యుత్, రహదారులు, భవనాలు, టీజీఐఐసీ అధికారులూ వేగంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రహదారులు, మెట్రో మార్గాల అనుసంధానం, భూసేకరణ తదితరాంశాలపై అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆదేశించారు. మరి ఈ భవిష్యత్ నగరం ఎలా ఉండబోతోంది? ఎంత విస్తీర్ణంలో, ఏ విధంగా రూపుదాల్చనుంది? దానిద్వారా ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనాలు ఆశిస్తోంది ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.