Debate on Land Issues in Telangana : రాష్ట్రంలో భూమి సమస్యల చిక్కుముళ్లు వీడేదెప్పుడు?.. కొద్దిరోజులుగా అందర్నీ వేధిస్తోన్న ప్రశ్న ఇదే. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర్నుంచి ఈ విషయంలో వరస చర్యలు తీసుకుంటున్నారు. ధరణిపై ఉప సంఘం వేశారు. నూతన ఆర్వోఆర్ చట్టం కోసం మేధోమథనం చేస్తున్నారు. దాని ఆధారంగానే నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదాను కూడా విడుదల చేశారు.
ఒకవైపు ఈ ప్రక్రియ అంతా కొనసాగుతునే ఉన్నప్పటికీ మరోవైపు రైతులను ధరణి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. హక్కుల చిక్కుల పరిష్కారం కోసం తిరిగి తిరిగి విసిగి, ఈసారి ప్రాణాలు తీసుకునేలా చేస్తున్నాయి. మరి వీటన్నింటికీ శాశ్వత పరిష్కారం వచ్చేది ఎన్నడు? అది జరిగి వరకు ధరణిలో ఇక్కట్లు తీర్చడానికి ప్రభుత్వం ముందున్న మార్గాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.