Volunteers Working for YSRCP: వైసీపీకి, వాలంటీర్లకు మధ్య ఉన్న అనుబంధం మరోసారి బట్టబయలైంది. జనం జేబులో డబ్బుతో జీతాలు తీసుకుంటూ అధికారపార్టీకి ఊడిగం చేస్తున్న వలంటీర్లపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినా వైసీపీ నాయకులకు జంకుబొంకు లేకుండా అడుగడుగునా కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. మరో నెలన్నర మాత్రమే ఎన్నికలకు సమయం ఉండటంతో ఇప్పుడేం జరగాలి?
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వైసీపీ ఇనుపపాదల కింద నలిగిపోతున్న ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే ప్రజల ముందున్న కర్తవ్యం ఏంటి? సీవిజిల్ వంటి యాప్‌ను ఎలా ఉపయోగించుకోవాలి? రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం ప్రజలు నిర్వహించాల్సిన పాత్ర ఏంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం. నేటి కార్యక్రమంలో సిటిజన్స్ ఫర్ డెమొక్రసి కార్యదర్శి వి.లక్ష్మణరెడ్డి, రాజకీయ విశ్లేషకులు కాటా గౌతమ్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో గత అయిదు సంవత్సరాలుగా అప్రజాస్వామిక పాలన జరుగుతోందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసి కార్యదర్శి వి.లక్ష్మణరెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా పాలన జరుగుతోందని అన్నారు. స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పుకునే పరిస్థితి రాష్ట్రంలో ఎవరికీ లేదని విమర్శించారు. ఇటువంటి సందర్భంగాలో మేధావుల మౌనం సమాజానికి చేటు అని భావించి రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రొఫెసర్లు, వైస్ ఛాన్స్లర్స్తో సిటిజన్స్ ఫర్ డెమొక్రసి అనే ఒక కమిటీని 15 మందితో ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు.
సీఎం జగన్ రాయలసీమకు ఏం చేశారు? 2024లో ఎందుకు గెలిపించాలి?
అప్రజాస్వామికంగా ఎన్నికలు జరపడానికి వాలంటీర్ల వ్యవస్థను అధికార పార్టీ ఉపయోగించుకుంటోందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసి ముందుగానే గుర్తించిందని అన్నారు. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలను పేర్కొంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. వైసీపీ నేతలు సైతం దీనిని అంగీకరించారని పేర్కొన్నారు. వాలంటీర్లను ఒక సైన్యంగా తయారు చేసి ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని అధికార వైసీపీ చూస్తోందని వి.లక్ష్మణరెడ్డి విమర్శించారు. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందని తెలిపారు.
గత కొద్దిరోజులుగా వైసీపీ నాయకులతో కలిసి చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న వలంటీర్లను ఎన్నికల సంఘం తొలగిస్తూ వస్తోందని రాజకీయ విశ్లేషకులు కాటా గౌతమ్ పేర్కొన్నారు. తద్వారా ఈసీ దృష్టికి రానివి ఇంకా చాలా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రజాధనంతో వాళ్లకి జీతాలిస్తూ పార్టీకి పనిచేయిస్తున్నారన్న ఆరోపణలు నిజం అని తేలిందని అన్నారు. వాలంటీర్లను వెంటబెట్టుకుని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని, రాను అని చెప్పిన వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ఇవే కాకుండా ఏపీ ఎన్నికల్లో గెలవటం కోసం వైసీపీ వాళ్లు గత కొంత కాలంగా ఎటువంటి అడ్డదారులు తొక్కుతున్నారు? ఇకపై ఎలాంటి ఎత్తుగడలు వేసే అవకాశం ఉంది? ఎన్నికల అక్రమాలు, కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ప్రతి పౌరుడు రంగంలోకి దిగితే తప్ప ఏపీలో వైసీపీ బారి నుంచి ఎన్నికలను పారదర్శకంగా జరిపే పరిస్థితి లేదు. దీనిలో సీ విజిల్ యాప్ పాత్ర ఏంటి? వైసీపీకి పూర్తిగా వత్తాసు పలుకుతూ వారి కనుసన్నల్లో పనిచేసే అధికారుల పట్ల ఎలక్షన్ కమిషన్ ఎట్లా వ్యవహరించాలి? ఇలా పలు విషయాలపై వక్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వీడియో కోసం పైన కనిపించే లింక్‌పై క్లిక్ చేసి కార్యక్రమాన్ని చూడండి.