Prathidwani Debate on Unity of Central and State Governments : దేశాభివృద్ధి కోసం రాష్ట్రాలతో కలిసి టీం భారత్‌లా పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడో చెప్పారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు తప్ప, మిగతా సమయంలో కేంద్రంతో సత్సంబంధాలు కోరుకుంటామని తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సమాఖ్య స్పూర్తిగా తగినట్టుగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. తెలంగాణ పర్యటనలో ప్రధానితో పాటు అన్ని కార్యక్రమాల్లో కూడా సీఎం పాల్గొన్నారు. అదేవిధంగా కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాక్షించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. దేశాభివృద్ధిలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందన్న ఆయన, మూసీ రివర్ అభివృద్ధికి(Moosy River Development) కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండాలి. అందుకోసం ఏ విధంగా పనిచేయాలనే అంశంపై నేటి ప్రతిధ్వని.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
క్యా సీన్ హై! - ఎయిర్‌పోర్ట్‌లో మోదీ, రేవంత్‌ల మధ్య సరదా సంభాషణ
Revanth Govt Focus on State Development : తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను, చెప్పిన ప్రకారం సకాలంలో అమలు చేస్తూనే అటు కేంద్రంతోనూ సఖ్యతగా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావల్సిన నిధులు, ముఖ్యమైన పలు ప్రాజెక్టుల నిర్మాణాల అనుమతుల కోసం ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ వెళ్లి ప్రధానిని, ఇతర కేంద్రమంత్రులను కలవటం వంటివి చేశారు.
రాష్ట్రాలకు ప్రధానమంత్రి పెద్దన్న లాంటివారన్న సీఎం : ఈ చర్చల్లో రాష్ట్రంలో రీజినల్ రింగ్‌రోడ్డు దక్షిణ భాగానికి పచ్చజెండా ఊపింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని ఇప్పటికే నేషనల్ హైవేగా కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా తాజాగా ప్రధాని(PM MOdi) రెండు రోజుల పర్యటనకు తెలంగాణకు రావటంతో, ప్రొటోకాల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానం, వీడ్కోలు పలకటం చేశారు. బహిరంగ సభల్లోనూ ప్రధాని పెద్దన్న పాత్ర వహించి రాష్ట్రానికి చేయూత అందించాలని కోరారు.
అంతేకాకుండా కేంద్రం అండతోనే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని సీఎం రేవంత్ చెప్పడం, రాష్ట్ర శ్రేయస్సుకు సరికొత్త ఒరవడికి నాంది పలికినట్లే.ఎన్నికల వరకే రాజకీయాలు, ఫలితాల అనంతరం అభివృద్ధే ఎజెండా అని స్పష్టీకరణ చేయటం గొప్ప విషయం. రాష్ట్రం పట్ల సానుకూలంగా స్పందిస్తున్న కేంద్ర ప్రభుత్వం సైతం, తెలంగాణకు ఐఐహెచ్‌టీ, రెండు కీలక కారిడార్ల కేటాయించింది.
Navy Radar Center in Telangana : అదేవిధంగా రాష్ట్రానికి నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు పూనుకుంది. అంతేకాకుండా ఐపీఎస్ క్యాడర్ మంజూరులోనూ సానుకూల ధోరణి కనబరిచింది. కేంద్రం, రాష్ట్రం మధ్య సఖ్యత కొనసాగాలంటే ఏంచేయాలి? పరస్పర గౌరవం ఇచ్చిపుచ్చుకోవడంలో ఎలా నడుచుకోవాలి? అనేది ప్రధానంగా ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు ఏదేమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సఖ్యతే, ప్రజలకు శ్రీరామ రక్ష.
మోదీ జీ మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనకు సహకరించండి - ప్రధానికి సీఎం రేవంత్ రిక్వెస్ట్
నేటి నుంచి రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సేవలు - 'రైతు నేస్తం' పేరిట ఆన్‌లైన్ శిక్షణలు