Prathidwani on Single Screen Theatres Bandh in Telangana : ప్రేక్షకులకు వినోదం పంచుతున్న సినిమా థియేటర్లు కొన్నిరోజులపాటు మూత పడనున్నాయి. ఇటీవల కాలంలో ప్రేక్షకులను పెద్దఎత్తున ఆకట్టుకునే కొత్త చిత్రాలు విడుదలకు నోచుకోలేదు. అదే సమయంలో రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, ఐపీఎల్ మ్యాచ్‌ల కారణంగా జనం థియేటర్లకు వచ్చి సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు విరామం ప్రకటించారు ఎగ్జిబిటర్లు.
TS Cinema Theatres Closed 2024 : ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్ని థియేటర్లలో సినిమాల ప్రదర్శన ఆగిపోతుంది? థియేటర్లకు ప్రేక్షకులను దూరం చేస్తున్న ప్రధాన అంశాలేంటి? మరి నిర్వహణ ఎందుకు మోయలేనంత భారమైంది? సినిమా కలెక్షన్లలో ఎవరెవరికి ఎంతెంత పంపిణీ అవుతోంది? ఇటీవల కాలంలో శాశ్వతంగా మూతపడ్డ థియేటర్లు ఎన్ని? థియేటర్లలో పెరిగిన టికెట్ ధరలు, తినుబండారాల ధరలు. ఓటీటీ వేదికలు ఎంత మేరకు ప్రభావం చూపిస్తున్నాయి? ప్రేక్షకులు పెద్దఎత్తున థియేటర్లకు రావాలంటే ఈ రంగంలో ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది? ఇదే నేటి ప్రతిధ్వని.
మరోవైపు సినిమా ప్రదర్శనల వల్ల లాభం సంగతేమో కానీ నష్టం ఎక్కువ వస్తుందని థియేటర్ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల స్వచ్ఛందంగా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నాయి. నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్ అద్దెలు పెంచాలన్న కోరుతున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే ప్రదర్శనలు కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నాయి.
కాగా, గత రెండు వారాల్లో విడుదలైన ప్రసన్నవదనం, ఆ ఒక్కటి అడక్కు, బాక్, శబరి, కృష్ణమ్మ వంటి చిత్రాలు విడుదలకాగా అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక ఈ వారం మే 17న గెటప్ శ్రీను రాజు యాదవ్‌తో పాటు అపరిచితుడు రీరిలీజ్ కానున్నాయి. వీటితో పాటు దర్శిని, నటరత్నాలు అనే మరో రెండు సినిమాలు వస్తున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">