ETV Bharat / opinion

తుది దశకు చేరిన ఎన్నికల ప్రచారం - డబుల్ డిజిట్ సీట్లపై మూడు పార్టీల ధీమా - Telangana Election Campaign - TELANGANA ELECTION CAMPAIGN

Telangana Election Campaign : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష నేతలు విమర్శలు, ఆరోపణలతో ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలు, నెరవేర్చిన హామీలపై తమ ప్రసంగాల్లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు భావోద్వేగాలకు గాలం వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారసరళి ఎలా ఉంది? ఇదే నేటి ప్రతిధ్వని.

Prathidwani Debate on Election Campaign
Telangana Election Campaign (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 5, 2024, 11:26 AM IST

Prathidwani Debate on Election Campaign in Telangana : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. 17 లోక్‌సభ స్థానాల్లో రాజకీయ పార్టీలు ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ త్రిముఖంగా సాగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య, మరి కొన్నిచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంది.

ఈ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధిస్తామని ఎవరికి వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష నేతలు విమర్శలు, ఆరోపణలతో ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలు, నెరవేర్చిన హామీలపై తమ ప్రసంగాల్లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు భావోద్వేగాలకు గాలం వేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. బీఆర్‌ఎస్ మనుగడ సాగాలంటే ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థాయిలో సీట్లు సాధించాలని కేసీఆర్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇప్పటికే బస్సు యాత్ర పేరిట తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణలో 12 స్థానాల్లో గెలుస్తామని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.