Prathidwani Debate on Election Campaign in Telangana : పోలింగ్ గడువు దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచుతున్నారు. ఓట్ల వేటలో అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్‌షోలు, కార్నర్‌మీటింగ్‌లతో ప్రచారాన్ని మరింత హోరెత్తిస్తున్నారు. ఓట్ల వేటలో అభ్యర్థులు మాటల తూటాలు పేలుతున్నాయి. చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. మరోవైపు నేతలు పరస్పరం అవినీతి ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల సొంత బలానికి తోడు జనాకర్షణ కలిగిన నేతలు ప్రసంగాలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో మాదిరే జోరును కొనసాగించాలని కాంగ్రెస్ యత్నిస్తుండగా, ఉనికి చాటుకునేలా బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. నమో మోదీ పేరుతో బీజేపీ సైతం ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అంచనాల మేరకు ఫలితాలను సాధిస్తుందా? రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్కు ప్రజల మద్దతు ఏ మేరకు లభిస్తోంది? బీజేపీ ఆశించినన్ని సీట్లు గెలుచుకుంటుందా? ఇదే నేటి ప్రతిధ్వని.