Prathidhwani Debate On Wild Animals Attack On Tribal Areas : రాష్ట్రంలోని గిరిజన గూడాలు, అటవీగ్రామాల్లో పులులు, ఏనుగుల సంచారం పెరిగింది. జనావాసాల్లోకి ప్రవేశిస్తున్న కృూరమృగాల దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎప్పుడూ లేనిరీతిలో కొంతకాలంగా ఏనుగుల గుంపులు హడలెత్తిస్తున్నాయి. పంట చేలల్లో ఆదమరిచి పనులు చేసుకుంటున్న రైతులు, కూలీలు ఏనుగుల దాడిలో విగత జీవులవుతున్నారు. అడవుల్లో జనసంచారం పెరగడం వల్ల వన్యప్రాణుల ఉనికి ప్రమాదంలో పడుతోందన్న వాదన ఉంది. అసలు అడవుల్లో నిక్షేపంగా బతకాల్సిన జంతువులు, పక్షులు, ఇతర జీవజాతులు ఎందుకిలా చెదిరిపోతున్నాయి?
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వేసవిలో తాగునీటి కొరత, అడవుల దహనం, వేటగాళ్లు, స్మగ్లర్ల సంచారం వల్ల వన్యప్రాణులకు ఎలాంటి ముప్పు పొంచి ఉంటుంది? ఈ విషయంలో వన్యప్రాణి సంరక్షణ చట్టాలు ఏం చెబుతున్నాయి? అసలు కీకారణ్యాల్లో బతకాల్సిన పులులు, ఏనుగులు గ్రామాల వైపు ఎందుకొస్తున్నాయి? ఊహించని రీతిలో జరుగుతున్న కృూరమృగాల దాడుల నుంచి ప్రజలను ఎలా రక్షించాలి? వన్యప్రాణులు అభయారణ్యాలు దాటి బయటకురాకుండా చేయడం ఎలా? ఇదే నేటి ప్రతిధ్వని.