Prathidwani on Politicians with Criminal Cases : పొరపాటున ఏదైనా పోలీస్ కేసులో ఇరుక్కుంటే ప్రభుత్వం ఉద్యోగాలకు ఎందుకు పనికిరారు. యువతకు పెద్దలు తరచు చేసే హెచ్చరిక ఇది. అయితే కేసులున్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగానికే పనికి రాకుంటే, ఆ ప్రభుత్వాన్ని నడిపే పాలకులుగా మాత్రం ఎలా అర్హత లభిస్తుంది? దేశంలో ఏటికేడు తీవ్రమవుతోన్న నేర రాజకీయాలపై కొద్దిరోజులుగా జరుగుతోన్న చర్చ ఇది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఇదే అంశం బలంగా తెరపైకి వచ్చింది.
నేరగ్రస్త రాజకీయాలు దేశానికి తీరని చేటని రెండున్నర దశాబ్దాల క్రితమే సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసినా, ప్రజస్వామ్యవాదులు ఆవేదన వ్యక్తం చేస్తోన్నా పరిస్థితుల్లో ఎందుకు మార్పు రావడం లేదు? నేర రాజకీయాలు, కళంకిత నేతల వల్ల ప్రజాస్వామ్యం, ప్రజలకు పొంచి ఉన్నప్రమాదమేంటి? దిద్దుబాటు ఎలా? దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రత్యేక కోర్టుల్లో ప్రజాప్రతినిధులపై పోగుపడిన 4474 కేసులు తేల్చడంలో జాప్యమెందుకు? ఇదే అంశంపై ఈటీవీ నేటి ప్రతిధ్వని.
- " class="align-text-top noRightClick twitterSection" data="">