Prathidhwani On Increase in Education Fees : పాఠశాలలు, కాలేజీల్లో ఏటా పెరుగుతున్న ఫీజుల భారం ప్రజల్ని ఆర్థికంగా కుంగదీస్తోంది. పిల్లల్ని కని, చదివించి, ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న తపనతో తల్లిదండ్రులు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అందుకోసం తమ జీవితాల్ని ధారపోస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వం రంగంలో చౌకగా లభించిన నాణ్యమైన విద్య ఇప్పుడు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలకే పరిమితం అవుతోంది. ఫలితంగా తల్లిదండ్రులు ఆర్థికంగా చితికిపోతున్నారు.
ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు పెరిగిన ఫీజుల భారం. ఇందుకోసం తల్లిదండ్రులు ఆదాయంలో 59 శాతం ఖర్చు చేస్తున్నారు. ఏటా 10 శాతానికి పైగా పెరుగుతున్న విద్యా వ్యయాలు. అసలు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు చదువులు ఎందుకు ఖరీదైపోతున్నాయి? పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలకు ఎడ్యుకేషన్ ఎందుకు భారం అవుతోంది? అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చేదెలా? ఇదీ నేటి ప్రతిధ్వని.