Prathidhwani Debate On Bank Frauds : బ్యాంకుల్లో డబ్బులు భద్రంగా ఉంటాయని దాచుకుంటున్న ఖాతాదారులకు భంగపాటు ఎదురవుతోంది. గిఫ్ట్‌లు, ఆఫర్లు, రాయితీల వల వేస్తూ ప్రజలు దాచుకున్న సొమ్ము లూటీ చేస్తున్నారు ఆన్‌లైన్ మోసగాళ్లు. మరోవైపు అనైతిక కార్యకలాపాల ఉచ్చులోకి లాగి బెదిరింపులతో దోచుకుంటున్నారు. ఇలాంటి మోసాల ఉచ్చులో చిక్కుకొని 10 ఏళ్లలో ప్రజలు లక్షల కోట్ల రూపాయలు పొగొట్టుకున్నారు.
వీటిలో రుణాల రూపంలోని మోసాల వాటా సగం ఉంటే, కార్డులు డిజిటల్ బ్యాంకు లావాదేవీల వాటా ఇంకో సగం. దేశంలో మెట్రోనగరాల్లోనే బ్యాంకింగ్ మోసాలు అధికం. డ్రగ్స్ పార్సిళ్ల పేరుతో బెదిరించి డబ్బులు స్వాహా చేస్తున్నారంటూ పోలీసుల హెచ్చరిక. మరోవైపు బ్యాంకింగ్ మోసాల్లో 3 శాతం మించని రికవరీ రేటు. అసలు బ్యాంకు ఖాతాల రక్షణలో వైఫల్యాలకు కారణం ఏంటి? అసాధారణంగా జరుగుతున్న బ్యాంకింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసేది ఎలా? బ్యాంకులు ఖాతాదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకువాలనే అంశాలపై నేటి ప్రతిధ్వని.
- " class="align-text-top noRightClick twitterSection" data="">