ETV Bharat / opinion

ఆరోసారి బీజేపీతో దోస్తీకి సై- మిత్రపార్టీలకు నీతీశ్​ మొండిచేయి! - Bihar Political Crisis

Nitish Kumar Political Profile : బిహార్​ ముఖ్యమంత్రి, జేడీయూ పార్టీ అధినేత నీతీశ్​ కుమార్​ సుదీర్ఘకాలం​ సీఎంగా సేవలందించి రికార్డులోకెక్కారు. అయితే తన సొంతపార్టీ రాష్ట్రంలో మెజరిటీ సీట్లు గెలవకున్నా ఇన్నేళ్లు రాష్ట్రాన్ని ఏలారు. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన రాజకీయ ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Nitish Kumar Political Profile Bihar Political Crisis
Nitish Kumar Political Profile
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 7:25 PM IST

Nitish Kumar Political Profile : జనతాదళ్​ (యునైటెడ్​​) అధ్యక్షుడు, బిహార్​ ముఖ్యమంత్రి నీతీశ్​ కుమార్​ సొంతంగా మెజారిటీ స్థానాలు సాధించకుండానే వివిధ పార్టీలతో కూటములు ఏర్పరచుకొని రాష్ట్రాన్ని పాలించారు. సుదీర్ఘకాలంపాటు బిహార్​ సీఎంగా పనిచేసి చరిత్రలోకెక్కారు నీతీశ్. దేశంలోని కీలక రాజకీయ నేతల్లో ఒకరైన నీతీశ్‌ కుమార్‌కు కూటములు మారటం, మద్దతు ఉపసంహరించుకోవడం ఇదేమి కొత్త కాదు. ఏ పార్టీ గెలిచినా అధికారం మాత్రం తనకే ఉండాలన్నట్లు వ్యవహరించేవారు నీతీశ్​. 2013 నుంచి ఇప్పటివరకు 5 సార్లు తన మిత్ర పార్టీలకు మొండిచేయి చూపించిన నీతీశ్ ఆరోసారి బీజేపీతో కలిసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

విద్యార్థి దశనుంచే నాయకుడి లక్షణాలు!
1951, మార్చి 1న రాజధాని పట్నా శివారులోని భక్తియార్‌పూర్​లో ఆయుర్వేద వైద్యుడు, స్వాతంత్ర సమరయోధుడు దివంగత కవిరాజ్​ రామ్​ లఖన్​ సింగ్​కు జన్మించారు నీతీశ్​ కుమార్. బిహార్ ఇంజనీరింగ్​ కళాశాల(ప్రస్తుతం ఎన్​ఐటీ)లో ఎలక్ట్రికల్​ ఇంజినీరింగ్​ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే రాజకీయపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు నీతీశ్​. రాజకీయాల్లో పేరు కలిగిన లాలూ ప్రసాద్​, సుశీల్​ కుమార్​ మోదీ సహా సోషలిస్టు జయప్రకాశ్​ నారాయణ్​ వంటి నేతల ప్రేరణతో విద్యార్థి ప్రాయంలోనే పట్నా యూనివర్సిటీ స్టూడెంట్స్​ యూనియన్​ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతేగాక యూనియన్​కు ప్రధాన కార్యదర్శి బాధ్యతలను నిర్వర్తించారు.

నీతీశ్​ రాజకీయ ప్రస్థానం!
1985లో లోక్​దళ్​ పార్టీ తరఫున హర్నాట్​ అసెంబ్లీ సీటుకు పోటీ చేసిన నీతీశ్​ ఆ ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించారు. ఆ తర్వాత ఐదేళ్లకు జరిగిన పార్లమెంట్​ ఎన్నికల్లో బార్హ్​ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి తొలిసారి పార్లమెంట్​లో అడుగుపెట్టారు. ఇలా ఎంపీగా సేవలందిన ఐదేళ్లకు రాష్ట్రంలో మండల్​ ఉద్యమం తారాస్థాయిలో జరుగుతోంది. ఈ సమయంలో నీతీశ్​, సమతా పార్టీ నేత జార్జ్​ ఫెర్నాండెజ్‌కు మద్దతుగా నిలబడ్డారు. ఆ తర్వాత ఈ పార్టీని జేడీ(యూ)లోకి వీలీనం చేశారు. దీంతో 2005లో బీజేపీతో కలిసి కూటమిని ఏర్పాటు చేసి తొలిసారి బిహార్​ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు నీతీశ్​. ఇలా సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి పదవి కాలంలోనే తన పనితీరుతో విమర్శకుల ప్రశంసలు సైతం పొందారు నీతీశ్​. రాష్ట్రంలో నెలకొన్ని శాంతిభద్రతల సమస్యను పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించారు. అలా 2010, 2014, 2015, 2020ల్లో సీఎంగా ప్రమాణం చేసి తన సేవలందించారు. మొత్తంగా 8 ఏళ్ల 340 రోజులు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు.

అధికారం కోసం మిత్రపార్టీలకు మొండిచేయి!
72 ఏళ్ల నీతీశ్‌ కుమార్‌ తాను జతకట్టిన పార్టీలతో ఏనాడు సఖ్యతగా ఉండలేకపోయారు. ఇది ఆయన్ను తరచుగా పార్టీలను మారేలా చేసింది. 1990లో అప్పటి జనతాదళ్‌ సీనియర్‌ నాయకుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను బిహార్​ ముఖ్యమంత్రిగా చేయడంలో కీలక పాత్ర పోషించడం వల్ల నీతీశ్‌ కుమార్‌ పేరు తొలిసారి అందరికి తెలిసింది. అయితే 1994లో లాలూపై నీతీశ్​ తిరుగుబావుటా ఎగురవేశారు. ప్రముఖ సోషలిస్టు నాయకుడు జార్జ్‌ ఫెర్నాండెజ్‌తో కలిసి సమతా పార్టీని ఏర్పాటు చేశారు. 2003లో ఇది శరద్‌ యాదవ్‌ నేతృత్వంలోని జనతాదళ్‌(యునైటెడ్‌)లో విలీనమైంది. ఆ తర్వాత జేడీయూ అధ్యక్షుడిగా నీతీశ్‌కుమార్‌ ఎంపికయ్యారు. 2005 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని బిహార్ ముఖ్యమంత్రి తొలిసారి ఎన్నకయ్యారు నీతీశ్ కుమార్.

17 ఏళ్ల బంధానికి గుడ్​బై
బీజేపీ-జేడీయూ పార్టీలు 1998 నుంచి పొత్తులో ఉన్నాయి. అయితే 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్థిగా ఎవరిని ఉంచాలన్నదానిపై ఎన్డీయేలో ప్రతిష్టంభన నెలకొంది. ఆ సమయంలో ఎన్డీయే కూటమిలో సీనియర్‌ నేతగా పేరున్న నీతీశ్‌ పేరు కూడా వినిపించింది. అయితే, ప్రధాని అభ్యర్థిగా అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నీతీశ్‌ 2013 జూన్‌ 16న కూటమి నుంచి తొలిసారిగా బయటకి వచ్చేశారు.

నీతీశ్​ జంపింగ్​ జపాంగ్​ ప్రక్రియ
2013లో బీజేపీ కూటమికి గుడ్​బై చెప్పిన నీతీశ్​, ఆర్​జేడీలోని అసంతృప్త వర్గంతో పాటు కాంగ్రెస్​, సీపీఐ వంటి కొన్ని మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు నిర్విరామంగా సీఎంగా కొనసాగారు. అయితే మధ్యలో ఒక ఏడాదిపాటు(2014 మే నుంచి 2015 ఫిబ్రవరి వరకు) ముఖ్యమంత్రి పదవికి దూరంగా ఉన్నారు నీతీశ్​. ఆ సమయంలో వచ్చిన లోక్​సభ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి నైతిక బాధ్యతను వహిస్తూ ఆయన తన సీఎం పదవి నుంచి వైదొలిగారు. ఈ క్రమంలో అదే పార్టీలోని ముఖ్య నేత జితన్​ రామ్​ మాంఝీ ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయితే సంవత్సరం తిరిగేలోపే తన తిరుగుబాటుదారుడిగా చెప్పే జితన్​ రామ్​ మాంఝీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్​, ఆర్​జేడీల మద్దతుతో పడగొట్టారు. దీంతో మరోసారి బిహార్​ ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించారు.

ఆ తర్వాత వచ్చిన 2015 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్​, ఆర్​జేడీ, జేడీయూల కూటమి కలిసి పోటీ చేశాయి. ఈ ఎలక్షన్స్​లో ఈ మహాకూటమి అద్భుతమైన విజయం సాధించినప్పటికీ రెండేళ్లలోనే ఈ ప్రభుత్వం పడిపోయింది. అలా 2017లో బీజేపీ-ఎన్​డీఏ ప్రభుత్వంతో మళ్లీ జతకట్టారు. ఈ సమయంలో తన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వీ యాదవ్​పై పలు అవినీతీ ఆరోపణలు రావడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. దీంతో డిప్యూటీ సీఎం పదవి నుంచి వైదొలగాలని నీతీశ్‌ కుమార్ తేజస్వీని కోరారు. అయితే ఆర్జేడీ శాసనసభా పక్షం అందుకు నిరాకరించింది. ఈ క్రమంలో ఇరువురు నేతల మధ్య మనస్పర్థలు వచ్చి 2017 జులై 26 తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు నీతీశ్ కుమార్​. ప్రతిపక్ష బీజేపీతో జట్టుకట్టి గంటల వ్యవధిలోనే మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

అవకాశం ఇవ్వనందుకు గుడ్​బై
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే తరఫున నీతీశ్‌ కీలక ప్రచారం నిర్వహించారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్న నిర్ణయాన్ని విరమించుకున్న ఆయన 2020 అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి కేంద్ర మంత్రి, లోక్‌ జనశక్తి పార్టీ అధ్యక్షుడు రామ్‌విలాస్‌ పాసవాన్‌ మృతి చెందడం వల్ల ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు 2020లో బీజేపీకి చెందిన డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోదీకి అవకాశం వచ్చింది. అప్పటి నుంచి బీజేపీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చిన ఆయన చివరికి 2022 ఆగస్టు9న ఎన్డీయే నుంచి బయటకి వచ్చినట్లు ప్రకటించారు నీతీశ్ కుమార్​. వెంటనే తిరిగి మహాఘట్‌బంధన్‌ కూటమితో చేతులు కలిపారు. ఈ కూటమిలో కాంగ్రెస్​, ఆర్​జేడీ, సీపీఎంతో పాటు కొత్తగా మరో రెండు కొత్త లెఫ్ట్​ పార్టీలు చేరాయి. తాజాగా ఆ బంధాన్ని తెంపుకుని తిరిగి ఎన్​డీఏ కూటమిలో చేరారు.

'ఆయన పేరు గిన్నిస్​ బుక్​లో ఎక్కాలి'
'బీజేపీతో పొత్తుపెట్టుకోవడం, విడిపోవడం, మళ్లీ జతకట్టడం, బయటకురావడం, మరోసారి దోస్తీ చేస్తున్న నీతీశ్​ కుమార్​ పేరును గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లోకి ఎక్కించాలి'. అని కాంగ్రెస్​ ఎమ్మెల్యే అజిత్​ శర్మ వ్యాఖ్యానించారు. 'మట్టిలోనైనా కలుస్తాము కానీ బీజేపీతో కలవము'- 2013లో బీజేపీతో పొత్తు నుంచి బయటకు వచ్చిన అనంతరం నీతీశ్​ కుమార్​ చేసిన వ్యాఖ్యలను సైతం ఈయన గుర్తుచేశారు.

'ఊసరవెల్లిని మించిపోయారు'
తరచూగా రాజకీయ భాగస్వాములను మార్చే నీతీశ్ కుమార్​ రంగులు మార్చడంలో ఊసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. బిహార్ ప్రజల అభీష్టాన్ని నీతీశ్‌ విస్మరిస్తున్నారని, దీన్ని వారు ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోరని ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రను చూసి ప్రధాని మోదీతో పాటు నీతీశ్​ పార్టీ భాజపా భయపడుతోందని ఆరోపించారు. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ నాటకీయ పరిణామాలకు ఆయన తెరతీశారని వ్యాఖ్యానించారు.

తొమ్మిదోసారి సీఎంగా నీతీశ్ కుమార్ ప్రమాణస్వీకారం

బిహార్​లో NDA ప్రభుత్వం- ముఖ్యమంత్రిగా నీతీశ్​- డిప్యూటీ సీఎంలుగా ఇద్దరు బీజేపీ నేతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.