NDA Target 40 Seats Bihar : లక్ష్యం పెద్దదిగా ఉన్నప్పుడు దానిని ఛేదించే వ్యూహాలు కూడా సుదీర్ఘంగానే ఉంటాయి. ఇప్పుడు ఇదే సుదీర్ఘ లక్ష్యాలతో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు సార్లు కేంద్రంలో అధికారం దక్కించుకున్న బీజేపీ, త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో విజయం దక్కించుకునే దిశగా అడుగులు ముమ్మరం చేసింది. ఒక్క విజయమే కాదు ఏకంగా 400 పైచిలుకు పార్లమెంటు స్థానాల్లో విజయం దక్కించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
అయితే ఈ లక్ష్య ఛేదనకు సంబంధించి చేయాల్సినవన్నీ పూర్తి చేసుకున్న కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, 2029లో వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా గ్రౌండ్ వర్క్ ప్రారంభించేసింది. మొత్తంగా 2014, 2019 ఎన్నికల్లో సాధించిన విజయాలతో సంతృప్తి చెందకుండా ప్రస్తుత ఏడాది జరగనున్న ఎన్నికలతో పాటు 2029లో జరగబోయే ఎన్నికలకు కూడా పక్కా ప్లాన్‌ను రెడీ చేసుకుని రంగంలోకి దిగింది. అందులో భాగంగా 40 లోక్‌సభ సీట్లు ఉన్న బిహార్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. తమను గద్దె దించాలని నిర్ణయించుకుని ఏర్పడిన విపక్షాల కూటమికి గట్టి షాక్ ఇచ్చి జేడీయూతో కలిసి మళ్లీ బిహార్ పీఠాన్ని కైవసం చేసుకుంది.
మహాగఠ్బంధన్తో కలిసి ఏడాదిన్నర క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ తిరిగి ఎన్డీఏ గూటికి చేరిపోయారు. బీజేపీతో కలిసి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎన్డీఏలో జేడీయూ చేరిక ఇరుపార్టీలకు లాభం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక బిహార్‌లో గతసారి 39 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకున్న ఎన్డీఏ, ఈసారి 40 స్థానాలను టార్గెట్‌గా పెట్టుకుంది.
-
#WATCH | Patna, Bihar: BJP national president JP Nadda says, "It is on record that whenever NDA forms government in Bihar, stability and development take a quantum leap. Under the leadership of PM Modi, NDA will sweep the Lok Sabha election and will form the govt in 2025." pic.twitter.com/s5KfGel4c6
— ANI (@ANI) January 28, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Patna, Bihar: BJP national president JP Nadda says, "It is on record that whenever NDA forms government in Bihar, stability and development take a quantum leap. Under the leadership of PM Modi, NDA will sweep the Lok Sabha election and will form the govt in 2025." pic.twitter.com/s5KfGel4c6
— ANI (@ANI) January 28, 2024#WATCH | Patna, Bihar: BJP national president JP Nadda says, "It is on record that whenever NDA forms government in Bihar, stability and development take a quantum leap. Under the leadership of PM Modi, NDA will sweep the Lok Sabha election and will form the govt in 2025." pic.twitter.com/s5KfGel4c6
— ANI (@ANI) January 28, 2024
"నీతీశ్‌తో బీజేపీ పొత్తు రాష్ట్రానికి మేలు చేస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేస్తుంది. మొత్తం 40 సీట్లు గెలుచుకుంటాం. రాష్ట్రాన్ని కొత్త ప్రభుత్వం ఉజ్వల్ బిహార్‌గా మార్చుతుంది. ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడే బిహార్ ప్రజలు అభివృద్ధి పరంగా లాభపడ్డారు."
- జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు
2020 జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 125 సీట్లను గెలుచుకుంది. మహాగఠ్‌బంధన్ 110 సీట్లు గెలుచుకోగా ఇతరులు 8స్థానాలను కైవసం చేసుకున్నారు. నీతీశ్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక అంతకుముందు లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 39 సీట్లు గెలుచుకోగా మహాగఠ్ బంధన్ ఒకే ఒక్క ఎంపీ సీటు గెలుచుకుంది. ఇప్పుడు మరోసారి లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీకి మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో షాక్ ఇవ్వాలని బీజేపీ నిర్ణయించుకుంది.
-
#WATCH | Bihar's newly elected Deputy CM Samrat Choudhary says, "We will win all 40 Lok Sabha seats in Bihar. In 2020 we won the elections and defeated Lalu Yadav's family and will do the same in future also." pic.twitter.com/uEpDu6rn9r
— ANI (@ANI) January 28, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Bihar's newly elected Deputy CM Samrat Choudhary says, "We will win all 40 Lok Sabha seats in Bihar. In 2020 we won the elections and defeated Lalu Yadav's family and will do the same in future also." pic.twitter.com/uEpDu6rn9r
— ANI (@ANI) January 28, 2024#WATCH | Bihar's newly elected Deputy CM Samrat Choudhary says, "We will win all 40 Lok Sabha seats in Bihar. In 2020 we won the elections and defeated Lalu Yadav's family and will do the same in future also." pic.twitter.com/uEpDu6rn9r
— ANI (@ANI) January 28, 2024
"మేం బిహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటాం. 2020 ఎన్నికల్లో మేమే గెలిచాం. అప్పుడు లాలూ యాదవ్ కుటుంబాన్ని ఓడించాం. ఇక భవిష్యత్తులో కూడా అదే చేస్తాం"
- సామ్రాట్ చౌదరి, బిహార్ డిప్యూటీ సీఎం
ఇక రాష్ట్రంలోని మిత్రపక్షాల సహకారంతో కచ్చితంగా 40 లోక్‌సభ సీట్లను కైవసం చేసుకోవాలని భావిస్తోంది ఎన్డీఏ. జేడీయూ నీతీశ్ కుమార్ కూర్మి వర్గం పెద్ద ఎత్తున ఎన్డీఏకు బలంగా నిలవనుంది. సంఖ్యాపరంగా వారు తక్కువే అయినా కొన్ని ప్రాంతాల్లో వారి ప్రభావం ఎక్కువగానే ఉంది. అధికార కూటమి వెంటే వారంతా నడిచే అవకాశం ఉంది. ఆర్ఎల్జేడీ ఉపేంద్ర కుశ్వాహ వర్గంతోపాటు ఎల్జేపీ చిరాగ్ పాస్వాన్, హెచ్‌ఏఎం సంతోశ్ కుమార్ సుమన్ దళిత వర్గాలు కూడా ఎన్డీఏ- జేడీయూ కూటమికే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి.
-
#WATCH | On NDA govt in Bihar, RLJD Chief Upendra Kushwaha says, "This is a natural alliance and people gave the mandate to this alliance only...Now Bihar will develop and NDA will win all 40 Lok Sabha seats." pic.twitter.com/qA1O6XCl3z
— ANI (@ANI) January 28, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | On NDA govt in Bihar, RLJD Chief Upendra Kushwaha says, "This is a natural alliance and people gave the mandate to this alliance only...Now Bihar will develop and NDA will win all 40 Lok Sabha seats." pic.twitter.com/qA1O6XCl3z
— ANI (@ANI) January 28, 2024#WATCH | On NDA govt in Bihar, RLJD Chief Upendra Kushwaha says, "This is a natural alliance and people gave the mandate to this alliance only...Now Bihar will develop and NDA will win all 40 Lok Sabha seats." pic.twitter.com/qA1O6XCl3z
— ANI (@ANI) January 28, 2024
మరోవైపు, ఇటీవలే బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ శతజయంతి వేళ ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో గౌరవించింది కేంద్ర ప్రభుత్వం. 1970, 80ల్లో దేశ సామాజిక రాజకీయాలపై ఎంబీసీ నేతగా ఠాకూర్ వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను సమూలంగా మార్చివేసింది. ఇప్పుడు ఆయన వర్గానికి చెందిన వారితోపాటు అభిమానులు కూడా ఎన్డీఏకు జై కొట్టే అవకాశం ఉంది. అలా వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని 40 సీట్లు కచ్చితంగా గెలుస్తామని ఎన్డీఏ ధీమాగా చెబుతోంది.
-
#WATCH | On NDA govt in Bihar, Lok Janshakti Party (Ram Vilas) president Chirag Paswan says, "It is a matter of happiness that Bihar has now got the NDA government...Looking at the current situation, I can say that NDA will win all 40 seats of Bihar." pic.twitter.com/RT2nZHRjTc
— ANI (@ANI) January 28, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | On NDA govt in Bihar, Lok Janshakti Party (Ram Vilas) president Chirag Paswan says, "It is a matter of happiness that Bihar has now got the NDA government...Looking at the current situation, I can say that NDA will win all 40 seats of Bihar." pic.twitter.com/RT2nZHRjTc
— ANI (@ANI) January 28, 2024#WATCH | On NDA govt in Bihar, Lok Janshakti Party (Ram Vilas) president Chirag Paswan says, "It is a matter of happiness that Bihar has now got the NDA government...Looking at the current situation, I can say that NDA will win all 40 seats of Bihar." pic.twitter.com/RT2nZHRjTc
— ANI (@ANI) January 28, 2024
ఆరోసారి బీజేపీతో దోస్తీకి సై- మిత్రపార్టీలకు నీతీశ్ మొండిచేయి!
బీజేపీ బిగ్ రివెంజ్- ఏడాదిన్నరలో మళ్లీ బిహార్ పీఠం కైవసం- ఫుల్ జోష్‌తో లోక్‌సభ ఎన్నికలకు!