ETV Bharat / opinion

NDAను సేవ్ చేసిన సౌత్! ఏపీదే కీ రోల్​- మరోసారి ఆదుకున్న కంచుకోటలు - Lok Sabha Election Result 2024 - LOK SABHA ELECTION RESULT 2024

Lok Sabha Election Result 2024 : భారీ మెజార్టీ సాధించి బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ఎన్​డీఎ కూటమి ఆశలపై కీలమైన రాష్ట్రాలు నీళ్లు చల్లాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఢోకా లేకపోయినా, ఎన్​డీఏ కూటమికి భారీగా సీట్లు తగ్గిపోయాయి. కానీ, ఈ కష్టకాలంలో దక్షిణాది సహా మధ్యప్రదేశ్​, గుజరాత్​ లాంటి కంచుకోటలు కొద్దిగా ఆదుకున్నాయి.

Lok Sabha Election Result 2024
Lok Sabha Election Result 2024 (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 4, 2024, 6:08 PM IST

Lok Sabha Election Result 2024 : ఎన్నికల రణక్షేత్రంలో అన్నిసార్లు పార్టీల వ్యూహాలు ఫలించవు. ఈసారి తిరుగులేని విజయం సాధిస్తామని, 400 పైగా సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ సహా ఎన్​డీఏ నేతలంతా ధీమా వ్యక్తంచేశారు. అయితే ప్రతిపక్షం పట్టుదలగా పోరాడి NDA మెజార్టీని బాగా తగ్గించింది. కానీ బీజేపీ కూటమిని అధికారంలోకి రాకుండా మాత్రం అడ్డుకోలేకపోయింది. గత ఎన్నికల్లో 353 సీట్లు సాధించిన ఎన్​డీఏ ఈసారి 300మార్కును దాటడానికి కష్టపడింది. దీనికి అసలు కారణం అధికారం చేపట్టాలంటే ముఖ్యమైన రాష్ట్రాల్లో యూపీ, మహారాష్ట్ర, బంగాల్​లో ఎన్​డీఏ కూటమి భారీ ఎదురుదెబ్బ తగలడమే. ఎప్పటిలాగే బీజేపీ కంచుకోట రాష్ట్రాలైన మధ్యప్రదేశ్​, గుజరాత్​, హిమాచల్​ ప్రదేశ్​ లాంటి రాష్ట్రాలు ఆదుకున్నా, ఈ సారి అనూహ్యంగా దక్షిణాదిలో ఎన్​డీఏ కూటమికి బలం చేకూరింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, కర్ణాటకలో చెప్పుకోదగ్గ సీట్లు సాధించగా, చరిత్రలో తొలిసారి కమ్యూనిస్టు కంచుకోటలోనూ ఖాతా తెరిచింది.

యూపీలో 'ఇండియా' జోరు
కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకైనా మొత్తం 80 స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌ కీలకమైంది. 2014 నుంచి ఇక్కడ భారీ అధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీకి ఈసారి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఎన్​డీఏ కంటే ఇండియా కూటమే ఇక్కడ అత్యధిక స్థానాల్లో సత్తా చాటగా బీజేపీకి అనూహ్యంగా షాక్‌ తగిలింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో అప్నాదళ్‌తో కలిసి పోటీ చేసిన బీజేపీ ఏకంగా 73 స్థానాలను గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో సమాజ్‌వాదీ, బీఎస్పీ జతకట్టగా ఎన్​డీఏకు కాస్త తగ్గి 64 స్థానాలే వచ్చాయి. అయితే, గత రెండు ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్‌ ఈ సారి అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీతో జట్టుకట్టింది. సమాజ్‌వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో 62 స్థానాల్లో బరిలోకి దిగగా, కాంగ్రెస్‌ 17 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్‌కు కంచుకోటైన అమేఠీ, రాయ్‌బరేలిలో ఈసారి హస్తం పార్టీ తన సత్తాను చూపింది. ఈ రెండు స్థానాలను నిలబెట్టుకుంది. బీజేపీ కంటే ఎక్కువ స్థానాలను సొంతం చేసుకుంది.

బీజేపీ జోష్​కు దీదీ బ్రేక్​
అత్యధిక స్థానాలు గెలిచి బంగాల్​లో అతిపెద్ద పార్టీగా అవతరిస్తామన్న బీజేపీకి అక్కడా భారీ ఎదురు దెబ్బ తగిలింది. గతేడాది సాధించిన సీట్ల కన్నా తక్కువ స్థానాలను సంపాదించుకుంది. బంగాల్​లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ దూకుడుతో అధికార బీజేపీ నిలవలేకపోయింది. గత లోక్‌సభ ఎన్నికల్లో 18 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ, ఈసారి అంతకన్నా చాలా తక్కువ సీట్లకే పరిమితమైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 22 స్థానాల్లో గెలుపొందిన టీఎంసీ, ఈసారి మరింత బలపడింది.

ఇండియాకే జై కొట్టిన మరాఠీలు
మరో కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమికి లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి షాకిచ్చింది. ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం, ఎన్సీపీ శరద్‌ పవార్‌ వర్గాలు సత్తా చాటాయి. ఆ రాష్ట్రంలో శివసేన, ఎన్సీపీ పార్టీలు చీలినా ఏక్‌నాథ్‌ శిందే, అజిత్‌ పవార్‌ వైపు కాకుండా ఉద్ధవ్‌ఠాక్రే, శరద్‌ పవార్‌వైపే ఓటర్లు మొగ్గు చూపారు. గత ఎన్నికల్లో 49 స్థానాలకు 41 చోట్ల ఎన్​డీఏ కూటమి జయకేతనం ఎగురవేసింది. కానీ ఈసారి ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూడా బీజేపీ కూటమికి భంగపాటు ఎదురైంది. గత రెండు ఎన్నికల్లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైన కాంగ్రెస్‌ ఈసారి డబుల్‌ డిజిట్‌ను అందుకుంది.

ఆదుకున్న దక్షిణాది రాష్ట్రాలు
అయితే, కీలకమైన రాష్ట్రాల్లో ఎన్​డీఏ కూటమికి ఎదురుదెబ్బ తగిలినా దక్షిణాది రాష్ట్రాలు ఆదుకున్నాయి. ఇందులో ప్రథమ స్థానం ఆంధ్రప్రదేశ్‌దే. ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాల్లో సీట్లు కోల్పోయిన NDA ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆదుకుంది. ఏపీలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైకాపా విడివిడిగా పోటీచేశాయి. గత ఎన్నికల ఫలితాల్లో జనసేన, బీజేపీ ఖాతాను తెరవలేకపోయాయి. అధికార వైకాపా 22 స్థానాల్లో విజయం సాధించగా తెలుగుదేశం 3 లోక్‌సభ సీట్లను గెలుచుకుంది. అయితే గత ఎన్నికల్లో NDA కూటమిలో పక్షాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా బీజేపీకి దేశమంతా కలిపి 303 సీట్లు వచ్చాయి. ఈసారి ఆ పరిస్థితిలేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో అనుకున్న స్థానాలను సాధించుకోవడంలో వెనకబడిన బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ 2024 ఎన్నికల్లో దక్కలేదని ఫలితాల సరళి వెల్లడిస్తోంది. అయితే కూటమి పక్షాల సీట్లు కలుపుకుంటే ధీమాగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. అందులో ఏపీలో లోక్‌సభ సీట్ల కీలకంగా మారాయి.

కాంగ్రెస్​తో పోటీగా గెలిచిన బీజేపీ
తెలంగాణ కూడా ఈసారి బీజేపీకి కొంతవరకు కలిసి వచ్చింది. గత ఎన్నికల్లో మొత్తం 17 స్థానాల్లోనూ పోటీ చేసిన బీజేపీ నాలుగు స్థానాలు గెలిచింది. తద్వారా తెలంగాణలో కమలదళం తన సత్తాను తొలిసారి చాటినట్లైంది. గత ఎన్నికల్లో భారాస 17 చోట్ల పోటీ చేసి 9 చోట్ల గెలిచింది. కాంగ్రెస్‌ మూడు చోట్ల విజయం సాధించింది. అదే ఊపులో ఈసారి కూడా అన్నిచోట్లా పోటీచేసిన కమలదళం తన బలాన్ని రెట్టింపు చేసుకుంది.

ప్రభుత్వం లేకపోయినా గట్టి పోటీ
ఆ తర్వాత దక్షిణాదిలో మరో రాష్ట్రమైన కర్ణాటక మరోసారి కమలం పార్టీని ఆదుకుంది. రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా ఎన్​డీఏ కూటమికి 19 సీట్లను కట్టబెట్టింది. అధికార కాంగ్రెస్​ పార్టీ 9 సీట్లకే పరిమితమైంది. గత ఎన్నికల్లో బీజేపీ 25 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్​, జేడీఎస్​, ఇతరులు ఒకటి చొప్పున గెలుపొందారు. దీంతోపాటు అనూహ్యంగా కమ్యూనిస్ట్​ కంచుకోట కేరళలోనూ బీజేపీ బోణీ కొట్టింది. త్రిస్సూర్​లో బీజేపీ అభ్యర్థి సురేశ్​ గోపీ విజయం సాధించారు.

ఒడిశాలో కమల వికాసం
NDA కూటమిని ఆదుకున్న మరో రాష్ట్రం ఒడిశా. అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు జరిగిన ఒడిశాలో డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో కమలదళం విజయం సాధించింది. నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని పటిష్ఠమైన బిజూజనతాదళ్‌ను ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి రావడం సహా 21 లోక్‌సభ స్థానాల్లో అత్యధిక చోట్ల గెలుపొందింది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలో కమలదళం 8 స్థానాలు గెలుచుకోగా బీజేడీ 12 చోట్ల, కాంగ్రెస్ ఒక సీటులో విజయం సాధించాయి.

కంచుకోటల్లో కొనసాగిన కమలం జోరు
NDAను ముఖ్యంగా బీజేపీని అత్యధిక స్థానాలతో ఆదుకున్న మరో రాష్ట్రం మధ్యప్రదేశ్‌. మధ్యప్రదేశ్‌లో 2019లో 29కి 28 స్థానాలను కమలదళం కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక సీటుకే పరిమితమైంది. ఈసారి ఆ భాగ్యం కూడా కాంగ్రెస్‌ పార్టీకి బీజేపీ దక్కనివ్వలేదు. అన్ని స్థానాల్లోనూ స్వీప్ చేసింది. NDAకు కంచుకోటగా ఉన్న ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ బీజేపీకి తిరుగులేకుండా పోయింది. గుజరాత్‌లోని 26 స్థానాల్లో 2019 సార్వత్రిక సమరంలో బీజేపీ మొత్తం అన్ని స్థానాలను స్వీప్ చేసింది. ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈసారి ఇండియా కూటమిగా పోటీచేసిన ప్రతిపక్షాలు కేవలం ఒక స్థానంతో సరిపెట్టుకుంటే బీజేపీ 25స్థానాలను కైవసం చేసుకుంది.

మరోసారి కలిసివచ్చిన దిల్లీ
2019లో మాదిరిగానే NDAకు ఈసారి కూడా దిల్లీ కలిసి వచ్చింది. కూటమిగా పోటీచేసిన కాంగ్రెస్‌, ఆమ్ ఆద్మీ ఈసారి కూడా కమలదళం ముందు తేలిపోయాయి. 2019లో ఏడు స్థానాలను దక్కించుకున్న బీజేపీ, ఈసారి కూడా స్వీప్‌ చేసింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని 4 స్థానాలను గత ఎన్నికల్లో దక్కించుకున్న బీజేపీ, ఈసారి కూడా అన్ని స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.

వారణాసిలో ప్రధాని మోదీ హ్యాట్రిక్- మెజార్టీ ఎంతంటే?

ఉప ప్రధానిగా నీతీశ్​ కుమార్​! ఒప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.