Pratidwani : విధ్వంసపు శిథిలాల నుంచి స్వప్నాల సౌధాలను నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి ప్రాంతాన్ని పట్టిన నాటి పీడ, అది వదిలి వెళ్లిన చీడను ప్రక్షాళన చేసి నిర్మాణ పనులను పూర్తి స్థాయిలో పరుగులు పెట్టించేందుకు ముందుకు కదలుతోంది కూటమి ప్రభుత్వం. ఐదేళ్ల నిర్లక్ష్యాన్ని, కక్ష సాధింపులకు నిదర్శనంగా రాజధాని ప్రాంతమంతా మొలిచిన ముళ్లచెట్లు, పొదలు తొలగించి చదును చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఇకపై అమరావతి పురోగతి ఎలా ఉండబోతోంది? వేలాది ఎకరాల ల్యాండ్ బ్యాంక్ అనేది నవీన నగర నిర్మాణానికి ఎలాంటి భూమిక పోషించబోతోంది? ఇకపై అమరావతి ముఖచిత్రమేంటి? ఇదీ నేటి ప్రతిధ్వని.
తెలుగుదేశం విజయంతో అమరావతి ఊపిరి పీల్చుకుంటోంది. వైఎస్సార్సీపీ పాలనలో ఐదేళ్లుగా పాడుబడిన రాజధాని ప్రాంతం మళ్లీ కళ సంతరించుకుంటోంది. జంగిల్ క్లియరెన్స్ జోరుగా సాగుతుండగా ఆ తర్వాత రాజధానిలో రహదారులు బాగు చేస్తామని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ చెప్పారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతికి పూర్వవైభవం దిశగా అడుగులు పడుతున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఐదేళ్లుగా తాము అనుభవిస్తున్న నరకయాతనకు విముక్తి లభించిందని అమరావతి రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. విధ్వంసకారుడికి, విజనరీకి ఉన్న తేడా ఏంటో స్పష్టంగా తెలుస్తోందన్నారు. ముఖ‌్యమంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం ఈనెల 13న చంద్రబాబు అమరావతిలో పర్యటించి పెండింగ్ పనులపై అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
రాజధాని ప్రాంతంలో వేగంగా జంగిల్ క్లియరెన్స్ పనులు - ముళ్లకంపలు, చెట్ల తొలగింపు - Amaravati works
రాజధానిలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చేందుకు వీలుగా జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. గడచిన ఐదేళ్లుగా ఈ ప్రాంతాన్ని పట్టించుకోకపోవటంతో ప్రభుత్వ భవనాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు, సచివాలయ, హెచ్డీ ఐకానిక్ టవర్లు, ఎన్జీఓ భవనాలు తదితర ప్రాంతాల్లో ముళ్ల పొదలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయి. రాజధాని ప్రాంతంలోని 217 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో దాదాపు 70 శాతం మేర ప్రాంతంలో ఈ ముళ్లపొదలు, తుప్పలు పెరిగిపోయాయి. వీటిని తొలగించేందుకు సీఆర్డీఏ అధికారులు 250కుపైగా పొక్లెయిన్లు వినియోగిస్తున్నారు. నెల రోజుల్లో 23,429 ఎకరాల్లో విస్తరించిన ముళ్లచెట్లు, పొదలు తొలగిస్తామని అధికారులు తెలిపారు.
అమరావతి నిర్మాణం స్పీడప్ - ప్రతి సెంటు భూమి తీసుకోవాలని నిర్ణయం - Capital Amaravati Construction