ETV Bharat Pratidhwani : జగన్ మోహన్ రెడ్డికి రాయలసీమ ఎందుకు ఓటేయాలి? 2019లో వైసీపీ అధికారంలోకి రావటానికి అండగా నిలిచింది రాయలసీమ ప్రాంతం. 52 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాయలసీమలో వైసీపీ 49 స్థానాలు గెలుచుకుంది. మొత్తం 8 లోక్‌సభ స్థానాలనూ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. అంత ఆదరణ చూపిన తన ప్రాంతానికి ముఖ్యమంత్రి అవగానే జగన్ మోహన్ రెడ్డి ఏం మేలు చేశారు? వారి సమస్యలు ఏం పరిష్కరించారు? సీఎం పదవిలో కూర్చోవటం కోసం సీమకు చేసిన వాగ్దానాలు ఏంటి? ఎన్ని హామీలు నెరవేర్చారు? వైఎస్సార్సీపీ పాలనలో సీమ ప్రజలు సంతోషంగా ఉన్నారా? జగన్‌కు రాయలసీమ ఎందుకు ఓటేయాలి? అనే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో రైతు సంఘం అధ్యక్షుడు జీ ఈశ్వరయ్య, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఐదేళ్ల కాలంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అధికార వైసీపీలో కుమ్ములాటలు పతాక స్థాయి చేరాయి. సీఎం జగన్ సరిగా పని చేయని చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు స్థానచలనం కల్పించారు. రాజీనామాలు, వలసలతో అధికార పార్టీ తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటుంది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ - జనసేన పార్టీ - బీజేపీ కూటమిగా ఏర్పడింది. ఎన్డీఏ కూటమి నుంచి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. కూటమి గాలి రాయలసీమ జనం వైపు గట్టిగా వీస్తోందంటున్న రాజకీయ నిపుణులు అంటున్నారు.
చంద్రబాబు అంటే ఐటీ - జగన్ అంటే లూటీ : ప్రతిధ్వనిలో రాజకీయ విశ్లేషకులు
రాయలసీమను గాలికొదిలేసిన జగన్ : ప్రతిపక్షంలో ఉండగా అనేక ఆణిముత్యాల్లాంటి మాటలు చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక పూర్తి విరుద్ధంగా వ్యవహరించారని రాయలసీమ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు సంవత్సరాల జగన్ రెడ్డి పాలనతో సీమ ప్రజలు విసుగెత్తారు. రైతులకు వ్యవసాయం అంటే పండుగ అని చేసేందుకు కసి ఉందన్న జగన్, రాయలసీమ రైతుల్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. సొంత ఊర్లో బతకలేక పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నారు.
Pratidhwani: గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చామంటున్న సీఎం జగన్ మాటల్లో నిజమెంత..?
జగన్‌కు ఓటమిని ఇచ్చేందుకు ఓటర్లు సిద్ధం : ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వాలన్న జగన్ సీమలో ఉన్న పరిశ్రమల్నీమెడపట్టి తరిమేశారు. దీంతో రాయలసీమ యువత ఉద్యోగాల్లేక తీవ్ర నిరుద్యోగంతో అల్లాడిపోతున్నారు. సీమలో అభివృద్ధి జాడ లేదంటూ జగన్ రెడ్డిపై సీమ ప్రజలు రగిలిపోతున్నారు. రాయలసీమలో వైసీపీ పరిస్థితి తలకిందులైందంటున్న సీమ ప్రజలు ఎన్డీఏ కూటమి వైపు ఆకర్షితులు అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఓటమిని బహుమతిగా ఇవ్వడానికి సీమ ఓటర్లు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.