ETV Bharat / offbeat

బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? - ఆ సమయంలో నిద్రలేస్తే ఏం జరుగుతుంది? - Waking Up in Brahma Muhurta

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2024, 1:16 PM IST

What Is Brahma Muhurta : చాలామంది ప్రముఖులు తరచుగా చెప్పేమాట తాము బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేస్తామని. అలానే దైవచింతనకూ బ్రహ్మముహూర్తాన్ని మించింది లేదనేదీ తెలిసిందే. మనకు అందుబాటులో ఉన్న 24 గంటల్లో బ్రహ్మ ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యం? ఆ సమయంలో నిద్రలేస్తే మంచిదని చెప్పడం వెనుక ఉన్న లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా!

What Is Brahma Muhurta
What Is Brahma Muhurta (ETV Bharat)

Benefits Of Waking Up In Brahma Muhurta : బ్రహ్మముహూర్త సమయం.. దీన్నే అమృత కాలమనీ, బ్రహ్మ సమయమనీ అంటారు. ఇది బ్రహ్మ దేవునికి సంబంధించిన సమయం కాబట్టే ఆ పేరు వచ్చింది. వేకువ జామున మూడున్నర- మూడు ముప్పావు నుంచి అయిదు - అయిదన్నర గంటల మధ్యలో ఉన్న కాలానికే బ్రహ్మముహూర్తమని పేరు. పూర్వం మహర్షులు, రుషులు ఆధ్యాత్మిక ధ్యానం చేసేందుకు ఈ పవిత్రమైన కాలాన్నే ఎంచుకునేవారట. ఒకప్పుడు ఇళ్లల్లో పెద్దవాళ్లు కూడా సంగీత సాధనకూ, చదువుకునేందుకూ చిన్నారులను బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేపేవారు.

సూర్యోదయానికి దాదాపు గంటన్నర లేదా గంటా ముప్ఫైఆరు నిమిషాల ముందుగా వచ్చే ఈ టైంలో నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని.. ఆ తరువాత అరుణోదయాన్ని చూస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సూర్యుడి కన్నా ముందు, ప్రత్యక్ష నారాయణుడి రథసారథిగా పిలిచే అరుణుడు (అనూరుడు అనే పేరూ ఉంది) ఎర్రని రంగు కిరణాల రూపంలో దర్శనమిస్తాడు. లేలేత సూర్య కిరణాలతో కాసేపు మాత్రమే కనిపించే ఆ సుందరమైన దృశ్యం, ఆహ్లాదకరంగా అనిపించడంతోపాటు శరీరానికి విటమిన్‌ డీ కూడా పుష్కలంగా అందిస్తుంది.

ఆ సమయంలో నిద్రలేస్తే ఇన్ని ప్రయోజనాలా! : ఇక, బ్రహ్మముహూర్త సమయంలో నిద్రలేవడం వల్ల కలిగే లాభాలను గమనిస్తే ఈ టైంలో చుట్టూ ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి సౌండ్​ వినిపించదు. దాంతో దైవారాధన చేసినా, విద్యార్థులు చదువుకున్నా, ఏదయినా ఓ పనిని చేపట్టినా ఏకాగ్రతతో పూర్తిచేయవచ్చు. మనసు చేస్తున్న పనిపైనే శరీరం లగ్నం అవుతుంది. ఇంద్రియాలూ సైతం అప్రమత్తంగా పనిచేస్తాయి. అన్నింటికీ మించి మెదడు పనితీరూ చురుగ్గా ఉంటూ, మెరుగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలూ చెబుతున్నారు.

వీటన్నింటి ద్వారా సానుకూల దృక్పథం కూడా పెరుగుతుంది. ఆ ప్రభావం మిగిలిన రోజుపైనా పడి క్రమంగా ప్రతికూల ఆలోచనలు దూరమవుతాయని పరిశోధనల్లోనూ తేలింది. అంతేకాదు, ఈ సమయంలో గాలి కూడా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ గాలిని పీల్చడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఒత్తిడి సమస్య కూడా అదుపులోకి వస్తుంది. వీటన్నింటి కారణంగా శరీర జీర్ణ వ్యవస్థ, జీవక్రియల పనితీరూ మెరుగ్గా ఉంటుంది.ముఖ్యంగా ఏవైనా వ్యాయామాలూ, ధ్యానం వంటివి చేయాలనుకునేవారికీ, వ్యక్తిగత అభివృద్ధికోసం ఫోకస్​ చేసే వారికీ ఇదే సరైన సమయమని చెబుతారు.

బెడ్ మీద నుంచి కాలు కిందపెట్టగానే ఈ పని చేయండి - మీ జీవితం అద్భుతంగా సాగుతుంది! - Wake Up Time DOs And DONTs

అర్థరాత్రి మేలుకుంటున్నారా? మళ్లీ నిద్రపట్టడం లేదా? ఈ '7' టిప్స్ పాటించి చూడండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.