ETV Bharat / offbeat

వర్షాకాలంలో మసాలా దినుసులు పాడైపోతున్నాయా ? - ఈ టిప్స్​తో ఎప్పుడూ ఫ్రెష్​గా ఉంటాయి! - Tips to Protect Spices from Insects

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

How to Protect Spices : వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల మసాలా దినుసులు బూజు పట్టి పాడైపోతుంటాయి. అంతేనా కొన్ని మసాలాలకు పురుగులు కూడా పడుతుంటాయి. ఇంకా మసాలా పొడులు గడ్డ కడుతుంటాయి. అయితే, వానాకాలంలో మసాలా దినుసులు ఎక్కువ రోజులు ఫ్రెష్​గా ఉండాలంటే ఈ టిప్స్​ పాటించాలట.

How to Protect Spices :
Tips to Protect Spices from Insects (ETV Bharat)

Tips to Protect Spices from Insects : ప్రతి వంటింట్లోని పోపుల డబ్బాలో వివిధ రకాల మసాలా దినుసులు తప్పకుండా ఉంటాయి. ఇక నాన్​వెజ్​ వంటకాల్లో కొన్ని రకాల మసాలా దినుసులు వేస్తేనే.. కర్రీ రుచిగా ఉంటుంది. అందుకే కిచెన్​లో​ ఎప్పుడూ మసాలా దినుసులు ఉండేలా చూసుకుంటారు మహిళలు. అయితే, వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వల్ల వంటింట్లోని కొన్ని ఆహార పదార్థాలు పాడైపోతుంటాయి. ముఖ్యంగా కొన్ని మసాలా దినుసులు బూజు పట్టి పాడవుతుంటాయి. అయితే, ఈ సమయంలో కొన్ని టిప్స్​ పాటించడం వల్ల మసాలా దినుసులు, పొడులు పాడైపోకుండా, పురుగులు పట్టకుండా.. తాజాగా ఉండేలా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో మీరూ చూసేయండి..

ఎయిర్​టైట్​ కంటెయినర్లో : ఈ సీజన్​లో మసాలా దినుసులను తేమ ఎక్కువ ఉండే ప్రదేశాల్లో అస్సలు పెట్టొద్దు. మార్కెట్లో కొన్న మసాలా దినుసులను ఎండలో ఎండబెట్టి ఎయిర్​టైట్​ కంటెయినర్లో స్టోర్​ చేయండి.

నిల్వ పొడి వద్దు : ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి.. వంటి వాటిని ఎక్కువగా పొడి చేసుకుని నిల్వ ఉంచుకోకూడదు. ఎందుకంటే.. పొడులతో పోలిస్తే దినుసులు చాలా కాలంపాటు పాడవకుండా ఉంటాయి. అవసరమైనప్పుడు మిక్సీ పట్టుకుంటే ఫ్రెష్​గా ఉండటమే కాకుండా కూర రుచి పెరుగుతుంది.

వీటిలో వద్దు : చాలా మంది మసాలా దినుసులను ప్లాస్టిక్‌ కవర్లలో, స్టీలు సీసాల్లో నిల్వ ఉంచుతారు. కానీ, ఇలా కాకుండా.. వాటిని గాజు సీసాల్లో నిల్వ చేస్తే చాలాకాలం పాటు పాడవకుండా ఉంటాయట. అలాగే ఈ గాజు సీసాలను పొడిగా ఉండే ప్రాంతంలో పెట్టడం మరిచిపోవద్దంటున్నారు.

గాజు సీసాలో : కొంతమంది పసుపు, కారం, ధనియాల పొడి లాంటి వాటిని కూడా ఫ్రిజ్‌లో స్టోర్​ చేస్తుంటారు. ఇలా ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వాటి సహజ పరిమళాలు పోతాయి. అలాగే పొడి కాస్త గడ్డలా మారిపోతుంది. కాబట్టి గాజు సీసాలో స్టోర్​ చేసుకోండి.

వేడి చేయండి : మసాలా దినుసులను పాన్‌ లేదా అవెన్‌లో వేసి కాసేపు వేడి చేయాలి. తర్వాత వీటిని భద్రపరిస్తే ఎక్కువకాలంపాటు నిల్వ ఉంటాయి. వేటికవే విడివిడిగా స్టోర్​ చేయాలని గుర్తుంచుకోండి. అవసరమున్నప్పుడు మసాలా దినుసులను ఉపయోగించిన తర్వాత జార్‌ మూత గట్టిగా పెట్టడం మరిచిపోవద్దు.

ఇతర ఆహార పదార్థాలు పాడవుకుండా..

లవంగాలు : వర్షాకాలంలో ఇంట్లో ఎక్కడ చూసిన చీమలు కనిపిస్తుంటాయి. పంచదార డబ్బా కాస్త తెరిచి ఉంటే చీమలు మొత్తం చక్కెరను తినేస్తాయి. అయితే, ఒక కవర్​లో 5 లవంగాలు వేసి చక్కెర డబ్బాలో ఉంచండి. ఇలా చేస్తే చక్కెరకు చీమలు పట్టవని చెబుతున్నారు.

వేపాకులు : బియ్యంలో పురుగులు చేరకుండా ఉండడానికి మీరు వేపాకులను ఉపయోగించవచ్చు. వేపాకులలోని క్రిమిసంహారక లక్షణం వల్ల బియ్యంలో పురుగులు చేరకుండా ఉంటాయి. ముందుగా కొన్ని వేపాకులను తీసుకొని బాగా ఎండబెట్టుకొని మెత్తని పౌడర్​గా చేసుకోవాలి. దీన్ని లైనింగ్‌ క్లాత్‌ లాంటి నూలు వస్త్రంలో చిన్న చిన్న మూటలుగా కట్టి బియ్యం మధ్యలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల బియ్యంలో తెల్లపురుగులతో పాటు పెంకు పురుగులు కూడా చేరకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి :

ఈ వంటింటి చిట్కాలతో జీర్ణ సంబంధ సమస్యలకు చెక్‌ పెట్టండి!

ఈరోజు చాలా ‘హాట్‌ అండ్‌ స్పైసీ’ గురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.