ETV Bharat / offbeat

ఎంత తొలగించినా ఫ్రీజర్​లో ఐస్ పేరుకుపోతోందా? - ఇలా చేశారంటే ఆ సమస్యే ఉండదిక! - HOW TO STOP ICE BUILDUP IN FREEZER

రిఫ్రిజిరేటర్​ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం అవసరం - ఈ టిప్స్ పాటించారంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్!

Tips to Prevent Excess Ice Forming in Freezer
REFRIGERATOR MAINTENANCE TIPS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 20, 2024, 2:02 PM IST

Tips to Prevent Excess Ice Forming in Freezer : ఫ్రీజర్​లో ఐస్ ఏర్పడడం సహజమే! కానీ.. కొన్ని రిఫ్రిజిరేటర్లలో ఇది అసాధారణంగా ఫామ్ అవుతుంటుంది. తరచూ తొలగించినా ఫ్రీజర్​ నిండా ఐస్ గడ్డల్లాగా ఏర్పడుతూ.. ఆ ప్లేస్​​ మొత్తం ఆక్రమిస్తుంటుంది. అయితే, దీన్ని అలాగే వదిలేస్త్ అందులో స్టోర్ చేసుకునే ఆహార పదార్థాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలే ఎక్కువ అని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా పదార్థాల్లోని తేమను తొలగించి.. వాటిని పొడిగా, గట్టిగా, అవి రంగు-రుచి కోల్పోయేలా చేస్తుందంటున్నారు.

అంతేకాదు.. ఫ్రీజర్​లో ఇలా ఎక్కువ మొత్తంలో ఐస్ పేరుకుపోవడం రిఫ్రిజిరేటర్ పనితీరుపై కూడా ప్రభావం చూపుతుందంటున్నారు. మీ ఇంట్లో ఇలాంటి సమస్య ఉంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వడం ద్వారా ఇటు ఫ్రీజర్‌ను క్లీన్‌గా ఉంచుకుంటూనే.. అటు రిఫ్రిజిరేటర్‌ పనితీరునూ పెంచుకోవచ్చంటున్నారు. ఇంతకీ.. ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

  • కొంతమంది చీటికిమాటికి ఫ్రిజ్​ తలుపులు ఓపెన్ చేస్తుంటారు. ఇంకొందరు డోర్ ఎక్కువసేపు తెరిచి ఉంచుతుంటారు. అలాకాకుండా అవసరమున్నప్పుడే ఫ్రిజ్​ డోర్ తీయడం, వెంటనే మూయడం మంచిదంటున్నారు నిపుణులు.
  • అదేవిధంగా.. తలుపులకు ఉన్న రబ్బర్‌ సీలింగ్‌ గ్యాస్కెట్స్‌ సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? అనేది చెక్ చేసుకోవడం కూడా ముఖ్యమే అంటున్నారు. అవసరమైతే వీటిని మీ ఫ్రిజ్​ కంపెనీని బట్టి 2-5 ఏళ్ల మధ్య కాలంలో మార్చుకోవడం బెటర్. దీనివల్ల ఫ్రీజర్‌/ఫ్రిజ్‌ పనితీరు మెరుగుపడుతుందని సూచిస్తున్నారు.
  • అలాగే మీ రిఫ్రిజిరేటర్‌ మోడల్‌ని బట్టి.. మాన్యువల్‌లో పొందుపరిచినట్లుగా ఫ్రీజర్‌ థర్మోస్టాట్‌లో సంబంధిత సెట్టింగ్స్‌ చేసుకోవడం వల్ల కూడా ఫ్రీజర్‌లో ఐస్‌ పేరుకుపోకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.
  • కొన్ని ఫ్రిజ్​లలో ఆటో డీఫ్రాస్ట్‌ ఆప్షన్‌ ఉంటుంది.. మరికొన్నింటిలో ఇది ఉండదు. అలాంటి సందర్భాల్లో కూలింగ్‌ సిస్టమ్​తో సంబంధం లేకుండా నిర్ణీత వ్యవధుల్లో మనమే డీఫ్రాస్ట్‌ బటన్‌ నొక్కాలనే విషయం గుర్తుంచుకోవాలి. తద్వారా అప్పటిదాకా పేరుకున్న ఐస్‌ కరిగిపోయి.. ఫ్రీజర్‌లో ఎక్కువ మొత్తంలో ఐస్‌ పేరుకోకుండా జాగ్రత్తపడచ్చని సూచిస్తున్నారు.

అలర్ట్ - ఈ తప్పులు చేస్తే మీ ఫ్రిజ్ పేలిపోతుంది!

  • మనం ఆహార పదార్థాలు స్టోర్ చేసుకునే క్రమంలో కొన్నిసార్లు వాటి అవశేషాలు, ద్రావణాలు, ఐస్‌క్రీమ్‌.. వంటివి ఫ్రీజర్‌లో పడిపోతుంటాయి. అలాంటి టైమ్​లో ఆయా అవశేషాల్ని ఎప్పటికప్పుడు తొలగించడం మంచిదంటున్నారు. అలాగే.. నిర్ణీత వ్యవధుల్లో ఫ్రిజ్/ఫ్రీజర్‌ను వేడి నీళ్లు- బేకింగ్‌ సోడా మిశ్రమంతో క్లీన్ చేసుకోవడం వల్ల రిఫ్రిజిరేటర్ నుంచి దుర్వాసనలు వెదజల్లకుండా చూసుకోవచ్చంటున్నారు నిపుణులు.
  • అన్నింటికంటే ముఖ్యంగా ఫ్రీజర్‌లో అవసరమైన వస్తువులే ఉంచేలా చూసుకోవాలి. అంతేకానీ.. ఖాళీ లేకుండా అన్నీ అందులో పెట్టేయకూడదు. ఇలా ఫ్రీజర్‌ ఎంత ఖాళీగా ఉంటే.. అధిక మొత్తంలో ఐస్‌ పేరుకుపోకుండా ఉంటుందని.. తద్వారా శుభ్రంగానూ ఉంటుందంటున్నారు.
  • అలాగే.. ఫ్రిజ్‌/ఫ్రీజర్‌ను కిటికీలు, వేడి ఉత్పత్తి చేసే వస్తువులకు దూరంగా ఉంచడం బెటర్. ఎందుకంటే.. ఇది కూడా ఫ్రీజర్‌లో ఎక్కువ మొత్తంలో ఐస్‌ పేరుకుపోకుండా చేస్తుందని చెబుతున్నారు.
  • ఇకపోతే.. చాలామంది రిపేర్‌కొచ్చే దాకా కానీ రిఫ్రిజిరేటర్ గురించి పట్టించుకోరు. అలాకాకుండా ఏడాదికి ఒకసారి అయినా కనీసం ఫ్రిజ్‌ కాయిల్స్‌ని శుభ్రం చేయించడం, వాటర్‌ ఫిల్టర్స్‌ని మార్చడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఇది కూడా ఫ్రిజ్​ ఎక్కువ కాలం మన్నేలా, ఫ్రీజర్​లో ఐస్ పేరుకుపోకుండా ఉండడానికి తోడ్పడుతుందంటున్నారు.

ఈ ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? విషంతో సమానం జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.