ETV Bharat / offbeat

టిఫెన్స్​లోకి పల్లీ చట్నీ తిని బోర్​ కొట్టిందా? - ఓసారి ఈ కర్రీ ట్రై చేయండి - కాంబినేషన్​తో పాటు టేస్ట్​ సూపర్​​! - TAMILNADU STYLE VADA CURRY

-తమిళనాడులో వెరీ ఫేమస్​ రెసిపీ ఇది -ఇడ్లీ, దోశ.. ఇలా ఎందులోకైనా అద్దిరిపోతుంది

How to Make Tamilnadu Style Vada Curry
How to Make Tamilnadu Style Vada Curry (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2024, 4:00 PM IST

How to Make Tamilnadu Style Vada Curry: ఇడ్లీ, దోశ, వడ, పూరీ.. ఇలా బ్రేక్​ఫాస్ట్ ​ఏదైనా మెజారిటీ జనం వీటికి కాంబినేషన్​గా పల్లీ చట్నీ చేస్తుంటారు. అయితే ఎప్పుడూ పల్లీ చట్నీ తినాలంటే బోర్​ కొడుతుంది. పోనీ వేరేది ఏమైనా చేయాలన్నా ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి. మరి మీరు కూడా బ్రేక్​ఫాస్ట్​లోకి పల్నీ చట్నీతో విసిగిపోయారా? అయితే మీకోసం ఓ సూపర్​ రెసిపీ తీసుకొచ్చాం. అదే తమిళనాడు స్టైల్​ వడ కర్రీ. ఈ కర్రీ ఉంటే ఒకటి తినే దగ్గర మరో రెండు ఎక్కువే తింటారు. అంత బాగుంటుంది దీని టేస్ట్​. పైగా దీని కోసం ఏవేవో పదార్థాలు అవసరం లేదు. చేయడం కూడా వెరీ సింపిల్​. మరి లేట్​ చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలి, కావాల్సిన పదార్థాలు ఈ స్టోరీలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

  • వడ కోసం:
  • పచ్చి శనగపప్పు - 1 కప్పు
  • పసుపు - పావు టీ స్పూన్​
  • సోంపు - అర టీ స్పూన్​
  • ఉప్పు- పావు చెంచా
  • నూనె - డీప్​ ఫ్రైకి సరిపడా

కర్రీ కోసం:

  • నూనె - 4 టేబుల్​ స్పూన్లు
  • దాల్చిన చెక్క - 1
  • బిర్యానీ ఆకు - 1
  • లవంగాలు - 3
  • యాలకులు - 3
  • ఎండు మిర్చి - 2
  • ఉల్లిపాయ తరుగు - 1 కప్పు
  • కరివేపాకు రెబ్బలు - 2
  • పచ్చిమిర్చి చీలికలు - 2
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - అర టేబుల్​ స్పూన్​
  • పండిన టమాటలు - 2
  • ధనియాల పొడి - 1 టీ స్పూన్​
  • కారం - 1 టీ స్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నీళ్లు - అర లీటర్​
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • మటన్​ మసాలా - 1 టీ స్పూన్​

తయారీ విధానం:

  • ముందుగా పచ్చి శనగపప్పును శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఓ రెండు గంటలు నానబెట్టాలి. వీలైతే రాత్రంతా నానబెట్టినా ఏం కాదు.
  • ఇలా నానిన శనగపప్పును నీళ్లు లేకుండా వడకట్టి మిక్సీజార్​లోకి వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి పసుపు, సోంపు వేసి నీరు పోయకుండా గట్టిగా, బరకగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని ఉప్పు కలిపి పక్కన పెట్టాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి డీప్​ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఆయిల్​ హీటెక్కిన తర్వాత శనగపిండి మిశ్రమాన్ని చేత్తో చిన్న చిన్నగా నూనెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని ఎర్రగా వేయించి పక్కన పెట్టాలి. పిండి మొత్తాన్ని ఇలానే చేసి పెట్టాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి మరో పాన్​ పెట్టి నూనె పోయాలి. నూనె వేడిక్కిన తర్వాత దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి.
  • ఆ తర్వాత ఎండు మిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. అనంతరం కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసి మగ్గించుకోవాలి.
  • ఉల్లిపాయలు రంగు మారుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చి వాసన పోయేవరకు మగ్గించుకోవాలి.
  • ఆ తర్వాత బాగా పండిన టమాట ముక్కలు, ధనియాల పొడి, కారం వేసి వేసి
  • టమాట ముక్కల పై తోలు ఊడే వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మగ్గించుకోవాలి.
  • అనంతరం అర లీటర్​ నీరు పోసి మంటను హై ఫ్లేమ్​లో పెట్టి ఓ 8 నిమిషాల పాటు మరిగించుకోవాలి.
  • నీళ్లు మరుగుతున్నప్పుడు వేయించిన శనగపప్పు మిశ్రమాన్ని వేసి ఓ నిమిషం పాటు వేయించి స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • ఆ తర్వాత అందులోకి కొత్తిమీర తరుగు, మటన్​ మాసాలా వేసి కలపాలి. ఒకవేళ మటన్​ మసాలా లేనివారు గరం మసాలా వాడుకోవచ్చు. అంతే ఎంతో టేస్టీగా, బ్రేక్​ఫాస్ట్​లోకి సెట్​ అయ్యే వడ కర్రీ రెడీ.

మటన్​ ఎప్పుడూ కావొద్దు రొటీన్! - ఈ సారి దోసకాయ మటన్ కర్రీ చేయండి - సరికొత్త రుచిని ఆస్వాదిస్తారు

ఎన్నో పోషకాలున్న మఖానాతో "టేస్టీ మసాలా కర్రీ"- ఇలా చేస్తే రుచి అద్దిరిపోతుంది!!

ఆహా అనిపించే ​"ఆఫ్ఘాని ఎగ్​ మసాలా"- సూపర్​ టేస్టీ రెసిపీ - ఇంట్లో ఈజీగా చేసేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.